ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణకోర్టు విచారణల వీడియోల సోషల్ మీడియా వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

కోర్టు విచారణల వీడియోల సోషల్ మీడియా వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/ పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ జులై 28 2026: న్యూఢిల్లీ: కోర్టు విచారణల వీడియోలు, ఆడియోలను సోషల్ మీడియా మరియు ఇతర డిజిటల్ వేదికల్లో అనుమతి లేకుండా వినియోగించడంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు విధించింది. ముందస్తు అనుమతి లేకుండా కోర్టు రికార్డింగ్‌లను పోస్ట్ చేయడం, ప్రసారం చేయడం, డౌన్‌లోడ్ చేయడం, రీ-పోస్ట్ చేయడం లేదా ఇతరులకు పంపిణీ చేయడం నిషేధమని స్పష్టం చేసింది. కోర్టు విచారణల వీడియోలను ఎడిట్ చేసి తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేయడం, వాటి ద్వారా ఆదాయం (మానిటైజేషన్) పొందడం, అనుమతి లేకుండా భద్రపరచడం వంటి చర్యలను తీవ్ర ఉల్లంఘనగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడడంతో పాటు విచారణల సమగ్రతను పరిరక్షించేందుకు ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపింది. అయితే మీడియా సంస్థలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. కోర్టు విచారణలకు సంబంధించిన వార్తలను, తీర్పులను, కేసుల పురోగతిని జర్నలిస్టిక్ ప్రమాణాలకు అనుగుణంగా రిపోర్ట్ చేయడంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేసింది. కోర్టు రికార్డింగ్‌ల దుర్వినియోగాన్ని మాత్రమే నిరోధించే ఉద్దేశంతో ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. సోషల్ మీడియా వేదికల ద్వారా కోర్టు విచారణల వీడియోలను ఇష్టానుసారంగా వినియోగించే ధోరణికి చెక్ పెట్టేలా ఈ నిర్ణయం కీలకంగా మారిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!