ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిమద్దిగట్ల మోజర్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ

మద్దిగట్ల మోజర్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 14 2026: పెద్దమందడి మద్దిగట్ల-మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల మోజర్లలో విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మద్దిగట్ల సర్పంచ్ రాములు యాదవ్, మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్ చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వివిధ సదుపాయాలను కల్పిస్తూ, ఉచిత ఏకరూప దుస్తులను కూడా అందజేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం నాటికి విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించాలనే ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతుల ద్వారా బోధన తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మద్దిగట్ల సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ… విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులందరికీ ఉచిత యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మోజర్ల ఉపసర్పంచ్ రాములు యాదవ్, వార్డు సభ్యులు సింగం కృష్ణయ్య, శివ, బాలకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయ బృందం పి. వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, వాణి ప్రభ, పుల్లయ్య, కే. మధుసూదన్, ఎన్. వెంకటస్వామి, ఏ. వెంకటస్వామి, శ్రీనివాసులు, టీ.కే. ప్రవీణ్ కుమార్, చిన్నారెడ్డి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!