ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కొమ్ముగూడెంలో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

కొమ్ముగూడెంలో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

భారతదేశ స్వాతంత్ర్యం పోరాటంలో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాలను స్మరిస్తూ జాతీయ జెండా ఆవిష్కరణ…

భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగదనుల ఆశయాలను సాధిద్దాం-బిఆర్ఎస్  నాయకులు సోయం వీరభద్రం

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా సోయం వీరభద్రం…

దమ్మపేట,ఆగస్టు15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగుడెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.   గ్రామ పంచాయతీ సర్పంచ్ సోయం సత్యవతి జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం మహాత్మ గాంధీ చిత్రపటానికీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర్య సమరయోధులు, దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన సైనికులు,అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం బిఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం మాట్లాడుతూ సుమారు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వలస పాలనలో భారతదేశం బానిసత్వాన్ని అనుభవించిందని, లక్షలాది మంది త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు.భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ ,చంద్రశేఖర్ ఆజాద్,సర్దార్ వల్లభాయ్ పటేల్,అంబేద్కర్,అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం, ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు. వారి త్యాగాలను ఎప్పటికీ మరచిపోకూడదని, స్వాతంత్ర్య విలువలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల ఆశయాలను కొనసాగించడమే వారికి నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఎంతోమంది త్యాగాల ఫలితమే మన స్వేచ్ఛ అని అన్నారు
భారతదేశం కి స్వాతంత్ర్యం సులభంగా లభించలేదని, వలస పాలకులు 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి 1947 వరకు అనేక పోరాటాలు, జైలు శిక్షలు, లాఠీ దెబ్బలు, ఉరికంబాలు, ప్రాణత్యాగాల అనంతరం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.నేటి యువతరం స్వేచ్ఛగా జీవిస్తూ, విద్యను అభ్యసిస్తూ, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతున్నదంటే అందుకు నాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలే కారణమని అన్నారు. త్యాగాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, వారి కుటుంబాలకు సమాజం అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుద్ధుల శ్రీను,వార్డు సభ్యులు బుద్ధుల కృష్ణ ,సోయం కృష్ణవేణి,మెరీ,వాడే విజయకుమారి,పుష్ప,సోయం ఎర్రయ్య,నరసింహ రావు,వెంకన్నబాబు సత్యనారాయణ,నరసింహ రావు,గోపి
చెపా బాబురావు,పద్దం నరసింహ రావు,విజయలక్ష్మి,గ్రామ పంచాయతీ కార్యదర్శి వివిధ విభాగాలు ఉద్యోగులు
యూత్ సభ్యులు, గ్రామస్థులకు,విద్యార్థులు ,మహిళ సోధరిమనులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Previous article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!