ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిమనిగిల్ల గ్రామంలో సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం

మనిగిల్ల గ్రామంలో సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం

📰 Generate e-Paper Clip

జల సిరి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పిలుపు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: జల సిరి కార్యక్రమంలో భాగంగా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం చుట్టారు. “ప్రతి ఇంటికి ఇంకుడు గుంత – ప్రతి ఊరికి ఊట కుంట – ప్రతి పొలానికి పంట కుంట” అనే నినాదంతో గ్రామంలో నీటి సంరక్షణ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… ఉపయోగించిన నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. నీటి నిల్వలు పెరగడం ద్వారా భవిష్యత్ తరాలకు తాగునీరు, సాగునీటి అవసరాలు సులభంగా తీర్చవచ్చని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకుని నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో నీటి వనరులను పరిరక్షించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వెంకటేష్, ఉపసర్పంచ్ ముప్పూరి గణేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, గ్రామ పెద్దలు సంచార మౌని రాములు, రాంరెడ్డి, ప్రతాప్ రెడ్డి, బాలరాజు, వెంకటయ్య, శ్రీకాంత్ రెడ్డి, కోములయ్య, రాములు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!