ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిమహిళా సాధికారత – నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం

మహిళా సాధికారత – నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: శ్రీరంగాపురం మండల కేంద్రంలో సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, ప్రభుత్వ విద్య బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రూ.10 లక్షలతో నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య భవనానికి, రూ.10 లక్షలతో నిర్మించనున్న మండల మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపనలు నిర్వహించారు. అనంతరం రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదాం భవనానికి భూమిపూజ చేశారు. అలాగే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రూ.14.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పీఎం శ్రీ (PM SHRI) కంప్యూటర్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛాలతో, చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థికి అందుబాటులోకి రావాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానం నేటి విద్యార్థులకు అత్యవసరమైందని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళా సమాఖ్యలకు శాశ్వత భవనాల నిర్మాణం ద్వారా వారి సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మద్దిలేటి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీహరి రాజు, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!