చెరువు కట్టలు, స్మశాన వాటికలో కంపచెట్ల తొలగింపు.. పశువుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెల నిర్మాణం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి కు బ్యూరో నవంబర్ 12 2026: పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామ అభివృద్ధే లక్ష్యంగా మనిగిల్ల గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ ముప్పూరి గణేష్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజలకు, పశువులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల ద్వారా గ్రామంలోని చెరువు కట్టలపై పేరుకుపోయిన కంపచెట్ల తొలగింపు పనులను ప్రారంభించారు. అదేవిధంగా జేసీబీ యంత్రాన్ని ఏర్పాటు చేసి స్మశానవాటికలో పెరిగిన కంపచెట్లను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఎక్కడైనా కంపచెట్లు ఉన్నా వాటిని గుర్తించి తొలగిస్తామని సర్పంచ్, ఉప సర్పంచ్ తెలిపారు. మరోవైపు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మూగజీవాలు, పశువుల దాహార్తిని తీర్చేందుకు నీటి నిల్వ కోసం ప్రత్యేక తొట్టెల నిర్మాణ పనులు చేపడుతున్నారు. వేసవితో పాటు వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ ముప్పూరి గణేష్తో పాటు గ్రామ పెద్దలు రాములు, వెంకటయ్య, శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు, కోములయ్య, ముప్పూరి రాములు, కొత్తబండి, బోడి గణేష్, అంజి, శివకృష్ణ, సాగర్, కుమ్మరి బుచ్చయ్య, ముప్పూరి వెంకటయ్య, ముప్పూరి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.


