వనపర్తి ఎమ్మెల్యే గారు స్పందించండి….
మహిళా సంఘాల్లో గోల్‌మాల్.. సభ్యులకు, అధ్యక్షులకు తెలియకుండా డబ్బులు మాయం.
ఆర్టిఐ చట్టాన్ని బహిరంగంగా కాలరాస్తున్న అధికారులు.
అవినీతిని కప్పిపుచ్చేందుకు సమాచారాన్ని దాచిపెడుతున్న అధికార యంత్రాంగం……
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 15 2026:
సంవత్సరం గడిచిన మహిళ సంఘం అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారికి చెక్కుబుక్కులు, స్టాంపులు, రిజిస్టర్లు ఇవ్వాలని అధికారులు ఆదేశించిన ఇవ్వని బుక్ కీపర్ శ్రీధర్…
బుక్ కీపర్ బాధ్యతలు గుర్తు చేసినందుకు అధికారులని ట్రాన్స్ఫర్ చేసే స్థాయికి ఎదిగిన బుక్ కీపర్…..
గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ కాలంలో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి పేరు చెప్పుకొని గ్రామాన్ని, మండల అధికారులను శాసించి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలనలో కూడా శాసించే స్థాయికి ఎదిగిన బుక్ కీపర్ శ్రీధర్..
అవినీతిని అడ్డుకుంటానని నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ స్పందించాలి:
ఆర్టిఐ యాక్టివిస్టు జిల్లా అధ్యక్షులు మంగరాయి వెంకటేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆర్టిఐ చట్టాన్ని బహిరంగంగా కాలరాస్తున్న అధికారులు,అవినీతిని కప్పిపుచ్చేందుకు సమాచారాన్ని దాచిపెడుతున్న అధికార యంత్రాంగమని ఆరోపించారు… వనపర్తి నియోజకవర్గం అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామంలో మహిళా సంఘం పేరుతో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, ఐకెపి వరి కొనుగోలు కేంద్రం నిర్వహణ, నిధుల వినియోగం, రైతుల ధాన్యం కొనుగోలు వివరాలపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ 5వ వార్డు సభ్యులు ఏరాజమ్మని ఆంజనేయులు సమాచార హక్కు చట్టం–2005 కింద అధికారికంగా సమాచారం కోరినా, అధికారులు చట్టాన్ని గాలికొదిలేసి వ్యవహరించడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. సమాచార హక్కు చట్టం ప్రకారం 30 రోజుల్లో పూర్తి సమాచారం ఇవ్వాల్సిన డి.ఆర్.డి.ఏ మరియు మహిళా సంఘం సంబంధిత అధికారులు ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాచిపెట్టి, నెల రోజులు గడిచిన తర్వాత కూడా పూర్తి వివరాలు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం పేరుకే కొన్ని కాగితాలు ఇచ్చి, అసలు కీలకమైన రికార్డులు, ఖాతాలు, నిధుల లావాదేవీలు, వరి కొనుగోలు వివరాలు మరియు స్టాక్ రిజిస్టర్లు గోప్యంగా ఉంచడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి… ఈ సందర్భంగా ఆర్టిఐ యాక్టివిస్టుల జిల్లా అధ్యక్షులు మంగరాయి వెంకటేష్ తీవ్రంగా స్పందిస్తూ “సమాచార హక్కు చట్టం ప్రజల హక్కు. కానీ అడ్డాకుల మండలంలో అధికారులు మాత్రం ఈ చట్టాన్ని కాలరాస్తున్నారు. మహిళా సంఘాల్లో జరిగిన అవినీతి బయటపడుతుందనే భయంతోనే సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతున్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది పోయి, అక్రమాలను కప్పిపుచ్చే పనిలో ఉన్నారు” అని మండిపడ్డారు. మహిళా సంఘం ఖాతాల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయా..? ఐకెపి వరి కొనుగోలు కేంద్రంలో రైతుల పేర్లతో అక్రమాలు జరిగాయా..?

ధాన్యం కొనుగోలు చేసి రికార్డులు మార్చారా..?
నిధులను దుర్వినియోగం చేశారా..?
అనే అనుమానాలకు అధికారులు ఇప్పటికీ సమాధానం చెప్పడం లేదని విమర్శించారు.
అంతేకాకుండా సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై వెంటనే కేసులు నమోదు చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్న అధికారులపై రాష్ట్ర సమాచార కమిషన్ దృష్టి సారించాలని కోరారు.
వనపర్తి ఎమ్మెల్యే వెంటనే స్పందించి. బలీదుపల్లి మహిళా సంఘం ఆర్థిక లావాదేవీలపై విజిలెన్స్ విచారణ. ఐకెపి వరి కొనుగోలు కేంద్రంపై ప్రత్యేక దర్యాప్తు.
- సంబంధిత అధికారులపై సస్పెన్షన్ చర్యలు. రైతులు మరియు మహిళా సంఘ సభ్యుల ముందు బహిరంగ ఆడిట్. చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల డబ్బుతో నడిచే మహిళా సంఘాల్లో పారదర్శకత లేకపోవడం అత్యంత ప్రమాదకరమని, సమాచారం అడిగితే ఇవ్వకుండా బెదిరింపులు, ఆలస్యం, మోసపూరిత సమాధానాలు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆర్టిఐ కార్యకర్తలు హెచ్చరించారు. “సమాచారం దాచడం అంటే అవినీతిని ఒప్పుకున్నట్టే” అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని ఆర్టిఐ జిల్లా అధ్యక్షులు మంగరాయి వెంకటేష్ ఇట్టి విషయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
