పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 31 2026: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణవార్తతో బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు, స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలు కుటుంబ సభ్యులు ప్రకటించాల్సి ఉంది.
