ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిభారీ వర్షాల నేపథ్యంలో మద్నూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -తహసిల్దార్ ఎం డి ముజీబ్...

భారీ వర్షాల నేపథ్యంలో మద్నూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -తహసిల్దార్ ఎం డి ముజీబ్ విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్నూర్ మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ ఎం డి ముజీబ్ కోరారు. వాతావరణ శాఖ మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ప్రజల భద్రత దృష్ట్యా ఈ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలు, వాగుల వద్ద నివసించే ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనవసర ప్రయాణాలు చేయకుండా, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని తెలిపారు. మండల యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని తహసిల్దార్ ఎం డి ముజీబ్ పేర్కొన్నారు. ప్రజలెవరూ భయాందోళనకు గురికావద్దని, అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!