ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యం – సీఎం రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip


పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ హైదరాబాద్, జూలై 30 2026: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నా రెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందించిన ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై నివేదికను ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన కార్యక్రమాలకు అనుసంధానంగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్గానిక్ విధానంలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, రైతులు పండించిన ఉత్పత్తులను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసే విధానాన్ని రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఎక్స్టెన్షన్ అధికారుల ద్వారా రైతులకు శిక్షణ, సాంకేతిక సూచనలు అందించాలని, ఎల్‌నినో ప్రభావంతో తగ్గిన సాగు విస్తీర్ణం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించే అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను గ్రామాల వారీగా రూపొందించాలని కమిటీ నివేదిక సూచించింది. అలాగే పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ 75 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని, ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు మంజూరు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాంకేతిక మార్గదర్శకాలు అందించాలని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగును పెంచి రైతు బజార్లకు రవాణా సౌకర్యాలు కల్పించాలని నివేదికలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్ల స్థాపనకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అత్యవసర చర్యల అమలును పర్యవేక్షించేందుకు గ్రామస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.

Latest Articles

వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలపై క్షేత్ర సందర్శన

చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాల గుర్తింపు.. రైతులకు శాస్త్రీయ సూచనలు పొలిటికల్...

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:వైరా నియోజకవర్గం జూలూరుపాడులో *బార్బర్స్ డే* సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద చెలగాటం! నిబంధనలకు నీళ్లొదులుతున్న అనధికార వాటర్ బాటిల్స్ వ్యాపారంప్రస్తుత కాలంలో ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ మంచినీటి అవసరం విపరీతంగా...
error: Content is protected !!