
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 28 2026: నికార్సయిన ఉద్యమ నాయకుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్ష బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేడు ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకుని మునుపటిలాగే ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమంలో విశేష పాత్ర పోషించిన నికార్సయిన ఉద్యమ నాయకుడిగా ఆయన మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ, భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నారు.
