ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం...

మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం…

📰 Generate e-Paper Clip

 ఆగస్టు 29 శనివారం పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు కడప జిల్లా. కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో

ప్రపంచ ప్రఖ్యాతికాంచిన భారతదేశ ఇండియా హాకీ క్రీడా దిగ్గజం ధ్యాన్ చంద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ చిత్తా, ప్రభావతి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని అన్నారు. మన దేశం క్రీడారంగంలో అనేకసార్లు బంగారు పథకాలను సాధించి ప్రపంచ దేశాలలో చెప్పుకునే విధంగా భారత దేశ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ తన అత్యుత్తమ ప్రతిభతో, ఆరుసార్లు బంగారు పథకాలను సాధించి పెట్టారు. అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ క్రీడా దినోత్సవం గా ప్రకటించారు. వారి బాటలో నేడు క్రీడాకారులందరూ నడవాలని ఆమె పిలుపునిచ్చారు . ముఖ్యంగా ప్రతి విద్యార్థికి ఒక క్రీడపై మక్కువ ఉండాలంటే నిరంతరం సాధన అవసరం. తద్వారా , సంపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణ, వినయ విధేయతలు, ఓర్పు, సహనం, అలాగే క్రీడలలో ఓడిపోయినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం, లాంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!