ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి: పేదల ఇళ్లలో వెలుగుల పండుగ చేద్దాం నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తుంబూరు దయాకర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ (ప్రత్యేక ప్రతినిధి):

రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారమైన శుభవేళ, ఈ దీపావళి పండుగను ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారులతో కలిసి అత్యంత వైభవంగా జరుపుకోనున్నట్లు మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన దీపావళి పండుగ ఆత్మీయ శుభాకాంక్షలు అందించారు.

ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, పేదల ముఖాల్లో చిరునవ్వులు, వారి సొంతింటి సంతోషంలో తాను సైతం నేరుగా పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు. పండుగ రోజున స్వయంగా ఇందిరమ్మ ఇంట్లోనే లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకోబోతున్నట్లు పేర్కొన్నారు.

నాయకులు, అధికారులకు పిలుపు:

నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా తమ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లి, లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి ఈ దీపావళి పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆయన కోరారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

 

Latest Articles

కవయిత్రి మొల్ల విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు.. 11న భూమిపూజ

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా భూమిపూజకు సన్నాహాలు కుమ్మర కుల బంధువులంతా...

లక్షెట్టిపేట పట్టణ ప్రజలకు మరింత చేరువలో వైద్య సేవలు..నవంబర్ 7 :...

మట్టి ప్రమిదలు వెలిగిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం

చీకటిని పారద్రోలి వెలుగులను పంచే పండుగే దీపావళి -పలుస శంకర్ గౌడ్ పొలిటికల్ పవర్...

న్యాయవాద వృత్తిని వదిలి.. ప్రజాసేవే లక్ష్యంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ప్రస్థానం !

– విద్య, వైద్యం, మౌలిక వసతులు అన్ని రంగాల్లో దేవరకద్ర అభివృద్ధే...

ఈ నెల11న కుమ్మర ఇంటి ఆడపడుచు మహాకవయిత్రి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ఠాపన

 ఎమ్మెల్యే. తూడి మేఘా రెడ్డి చేతుల మీదుగా భూమి పూజకు కార్యాచరణ...

Related Articles

లక్షెట్టిపేట పట్టణ ప్రజలకు మరింత చేరువలో వైద్య సేవలు..నవంబర్ 7 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన...

దానవాయిగూడెం ప్రజల సమస్యపై తక్షణమే స్పందించిన చల్లా కృష్ణ – తుంబూరు దయాకర్ రెడ్డి! స్మశాన వాటికకు రెండు బోరింగ్ పంపులు మంజూరు.. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పాలేరు/ఖమ్మం:సమస్య ఏదైనా.. ప్రజల కష్టం కళ్లముందు కనిపిస్తే క్షణం ఆలస్యం చేయకుండా పరిష్కరించడంలో కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ముందే ఉంటారని మరోసారి రుజువైంది. పాలేరు నియోజకవర్గం,...

గార్ల మండల :JVV మండల అధ్యక్షుడి ఎన్నిక 

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్గార్ల మండలం ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షులుగా మాచర్ల సుందర్ కుమార్,...
error: Content is protected !!