పొలిటికల్ పవర్ దినపత్రిక పి ఎన్ 9టీవీ రిపోర్టర్. ఎం.ప్రసాద్ రావు కడప జిల్లా కలసపాడు జూన్ 11 కలసపాడు మండలంలోని హృదయ పేట గ్రామములో ఈనెల 10 11 తేదీలలో జరిగిన సమాధానరాగ్ని యొక్క దేవాలయ ప్రతిష్ట మరియు యేసు, మరియ జోజప్ప మంటప, వేడుకలను విచారణ గురువు కొత్తపల్లి ,మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిoచారు. ఈ సందర్భంగా డీన్ గురువులు జాల, విజయభాస్కర్ సమిష్టి దివ్య బలి పూజను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ దేవాలయ నిర్మాణమునకు ఎంతోమంది పెద్దల సహాయ సహకారాలు చేసి ఉంటారని వారిలో దాతృత్వ గుణము మనలో కూడా అలవాటు చేసుకోవాలని చెప్పారు. అనంతరం గిద్దలూరు తాలూకాలోని,మోటు విచారణ నుండి ఫాదర్, బాలరాజు మాట్లాడుతూ, మరియ తల్లికి ఉన్న మూడు సుగుణాలు గురించి తెలియపరిచాడు. దివ్య బలి పూజా అనంతరం హంస ఆవార్డు గ్రహీత కీర్తిశేషులు ఎస్. భజన పుల్లయ్య జ్ఞాపకార్థం వారి అల్లుడైన ప్రసాద్ రావు చే చక్కటి శాస్త్రీయ కోలాటo వేసి అందరిని మైమరపింప చేశారు. ఈ కార్యక్రమంలో బి కోడూరు విచారణ గురువులు జి.సురేష్ , మరియు దేవనగరం విచారణ గురువులు, గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు యువకులు మహిళలు అందరు పాల్గొన్నారు.
ముగిసిన సమాధాన రాగ్ని దేవాలయ వేడుకలు…
RELATED ARTICLES
