ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

మేడిపల్లి కమల నగర్ కాలనీలో రోడ్డును ఆనుకొని అక్రమ షెడ్ నిర్మాణం*   నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు

📰 Generate e-Paper Clip

 

మేడిపల్లి: 08 నవంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ

 

మేడిపల్లి పరిధిలోని కమల నగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆనుకొని వెలుస్తున్న అక్రమ షెడ్ నిర్మాణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, మున్సిపల్ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి కొందరు వ్యక్తులు యథేచ్ఛగా అర్ధరాత్రి 11 గంటలకు ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. ప్రధాన రహదారిని ఆనుకొని ఏకంగా రోడ్డు స్థలాన్ని సైతం ఆక్రమించి ఈ షెడ్ ను ఏర్పాటు చేస్తుండటంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.

ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ప్రమాదాల ముప్పు

కమల నగర్ కాలనీ ప్రధాన రహదారిపై నిత్యం 15 కాలనీల వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు పక్కనే అక్రమంగా నిర్మిస్తున్న ఈ షెడ్ వల్ల రహదారి పూర్తిగా ఇరుకుగా మారుతోంది. ఈ షెడ్ల వద్దకు వచ్చే వారు తమ వాహనాలను రోడ్డుపైనే నిలపడం వల్ల ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ అక్రమ నిర్మాణాల కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక అడుగు ముందుకేసి వరంగల్ నేషనల్ హైవే 163 రోడ్డు ను ఆక్రమించి పాన్ డబ్బా ఏర్పాటు చేశారు. ఈ పాన్ డబ్బా మరియు టీ పాయింట్ వలన ప్యాసింజర్ ఆటోలు, సెవెన్ సీటర్ ఆటోలు రోడ్డు ఆక్రమిస్తూ అక్కడ పార్కు చేయడం వలన పాదచారులు నడవడానికి కనీసం ఫుట్‌పాత్ స్థలం కూడా లేకపోవడంతో, ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని రోడ్డుపైనే నడవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల ఉదాసీనతపై స్థానికుల మండిపాటు

నేషనల్ హైవే 163 రోడ్డు మీద ఇంత అక్రమంగా రోడ్డును ఆక్రమిస్తూ షెడ్ వేస్తున్నా సంబంధిత మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఆక్రమణల లీగాలిటీని తనిఖీ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆక్రమణదారులు మరింత రెచ్చిపోయి రోడ్లను కబ్జా చేస్తున్నారని వాపోతున్నారు. ఇట్టి విషయంపై హైడ్రా అధికారులు,

జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలి.

ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తూ, కాలనీ అందాన్ని పాడుచేస్తూ రహదారులను ఆక్రమించి నిర్మిస్తున్న ఈ అక్రమ షెడ్ పై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కమల నగర్ కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేసి, రోడ్డును పునరుద్ధరించాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్ష కార్యదర్శులు ప్రకాష్ గుప్తా, డి ఎస్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ కిషోర్, కూరెళ్ళ ఉపేందర్, శంకర్, నవీన్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest Articles

తిరుమలయ్య గుట్టను సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

రూ.2 కోట్లతో సమగ్ర అభివృద్ధి పనులు.. రహదారి, తాగునీరు, హరిత హోటల్‌తో పాటు...

జనసేన ఎమ్మెల్యేకు బిగ్ షాక్: బత్తుల రామకృష్ణ భార్యపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు ఘన విజయం!

 సీతానగరం/తూర్పుగోదావరి:పొలిటికల్ పవర్ ప్రతినిధితూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది....

సాంస్కృతిక కార్యక్రమాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 7 ( పొలిటికల్ పవర్ న్యూస్...

జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర ఆకస్మిక తనిఖీ…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

Related Articles

కొత్తగూడ ఏజెన్సీలో అక్రమ బహుళ అంతస్తులు నిర్మాణాలను తక్షణమే తొలగించాలి… ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తే సహించం! అధికారుల మౌనం వెనుక ముడుపుల మాయాజాలం?

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులకు రక్షణ కవచంగా నిలవాల్సిన చట్టాలు కొత్తగూడ మండల కేంద్రంలో...

గార్ల పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన డ్వాక్రా మహిళా సంఘం (ఐకెపి) మండల నాయకురాలు కందుల శోభారాణి భర్త కందుల రంజాన్ అకాల మరణం. ...

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంబేద్కర్ నగర్ చెందిన కందుల రంజాన్గత కొంతకాలంగా అనారోగ్యంతో...

రాజకీయ సంచలనం: జైలు గోడలు తెంచిన ‘ప్రజాభిమానం’.. పెళ్లకూరు జడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ సత్యనారాయణ రెడ్డి విక్టరీ! కార్యకర్తల ధీమా – ప్రజల తీర్పు: కక్షసాధింపు రాజకీయాలకు ఓటుతోనే తిరుగులేని జవాబు!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*పెళ్లకూరు: రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు తాత్కాలికమే తప్ప......
error: Content is protected !!