
నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 7 ( పొలిటికల్ పవర్ న్యూస్ )
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధనలో) శృతిలయ కూచిపూడి నృత్యాలయం, విజయవాడ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతున్నది.
ఈ కార్యక్రమములో గం గం గణపతి, విజ్ఞరాజంబజీ, శివ శివశంకరా, శంభో..శివశంభో తదితర గీతాలకు, అష్టకాలకు కేశవ, సహస్ర, హర్షిణి, వర్షిత, జ్యోతి, మేఘన, లలిత తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు.
అలాగే రెండవ కార్యక్రమములో భాగంగా సౌందర్య కూచిపూడి నృత్యనికేతన్, రాజమహేంద్రవరం వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమములో శివపంచాక్షరి, శంకరాశశిధర, ఓం నమ:శ్శివాయ, శివతాండవం తదితర గీతాలకు, అష్టకాలకు సఫల్య, పునర్విక, జస్వితి, ప్రకీర్తి తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయి.

