సీతానగరం/తూర్పుగోదావరి:
పొలిటికల్ పవర్ ప్రతినిధి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సీతానగరం జెడ్పీటీసీ ఎన్నికల సమరంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణకు సీతానగరం ప్రజలు కోలుకోలేని షాకిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే భార్య వెంకటలక్ష్మిని బరిలోకి దించి, అధికార-ఆర్ధిక బలాలను నమ్ముకుని అక్రమాలతో గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసినా.. సీతానగరం తీర్పు ముందు ఏ అహంకారమూ నిలవలేకపోయింది!
వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు గారు ఏకంగా 2,600 ఓట్ల భారీ మెజార్టీతో అలవోకగా విజయం సాధించి, ఫ్యాన్ గాలి పవర్ ఏంటో ప్రతిపక్షాలకు రుచి చూపించారు.
మండలంలో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి!
కేవలం జెడ్పీటీసీ స్థానమే కాకుండా, సీతానగరం మండలంలోని మొత్తం 20 ఎంపీటీసీ స్థానాల్లోనూ అత్యధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
ఎమ్మెల్యే అధికారాన్ని, ప్రచార ఆర్భాటాలను పక్కనపెట్టి.. ప్రజాదరణే ప్రాతిపదికగా ఓటేసిన సీతానగరం ప్రజలు, కరుటూరి శ్రీహరిబాబు గారికి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. జనసేన కోటలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడటంతో స్థానిక నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ జయహో వైఎస్సార్‌సీపీ అంటూ సంబరాలు జరుపుకుంటున్నారు!

