ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిరక్తదానం మహాదానం.. 28వ సారి రక్తదానం చేసిన నాగరాజును సన్మానించిన పలుస శంకర్ గౌడ్ 

రక్తదానం మహాదానం.. 28వ సారి రక్తదానం చేసిన నాగరాజును సన్మానించిన పలుస శంకర్ గౌడ్ 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 9 2026: రక్తదానం చేయడం అంటే ఒకరి ప్రాణాన్ని కాపాడినట్లేనని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. గురువారం తన వద్ద చదువుకున్న విద్యార్థి నాగరాజు 28వ సారి రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగరాజును అభినందిస్తూ రక్తదాన ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం రెండు సార్లు రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల దాత ఆరోగ్యానికి కూడా ప్రయోజనం ఉంటుందని, సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలుస శంకర్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో జైభీం సేవా సంఘం అధ్యక్షులు బండారు శ్రీనివాస్, కవి కంటె నిరంజనయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!