ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిరైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు

రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు

📰 Generate e-Paper Clip

ఖిల్లా ఘణపురం – పెద్దమందడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం త్వరలో ఆధునిక గోదాముల నిర్మాణం చేపడతాం

-వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 09 2026: రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా, మార్కెటింగ్ వ్యవస్థను గ్రామీణ స్థాయికి మరింత చేరువ చేసే లక్ష్యంతో వనపర్తి నియోజకవర్గానికి రెండు నూతన వ్యవసాయ మార్కెట్ యార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గురువారం ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఖిల్లా ఘణపురం–పెద్దమందడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేసి, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సేవాభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు మార్కెటింగ్ సౌకర్యాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖిల్లా ఘణపురం–పెద్దమందడి మండలాల రైతులకు ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ యార్డును మంజూరు చేసిందన్నారు. అలాగే గోపాల్పేట, ఏదుల, రేవల్లి మండలాలకు మరో మార్కెట్ యార్డును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ రెండు మార్కెట్ యార్డుల ద్వారా వేలాది మంది రైతులు ప్రయోజనం పొందనున్నారని, పంటలను దూర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం తగ్గి రవాణా ఖర్చు, సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను పారదర్శకంగా విక్రయించుకునే అవకాశం కల్పించడంతో పాటు, మధ్యవర్తుల దోపిడీ తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మార్కెట్ యార్డుల్లో ఆధునిక గోదాములు, షెడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, అంతర్గత రహదారులు, తూకం యంత్రాలు, రైతుల విశ్రాంతి గదులు వంటి అన్ని మౌలిక సదుపాయాలను దశలవారీగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా రైతులు పంటను వెంటనే అమ్మాల్సిన పరిస్థితి లేకుండా నిల్వ ఉంచుకునేందుకు అత్యాధునిక గోదాములను త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా, రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాల విస్తరణ వంటి అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర లభించే వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నూతన పాలకవర్గం రైతులు, వ్యాపారులు, అధికారులు మధ్య సమన్వయం సాధిస్తూ పారదర్శకంగా పనిచేసి రైతుల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ఖిల్లా ఘణపురం–పెద్దమందడి వ్యవసాయ మార్కెట్ యార్డు పాలకవర్గం చేత మార్కెట్ యార్డ్ జిల్లా అధికారిని పుష్పలత ప్రమాణస్వీకారం చేయించింది. అధ్యక్షురాలిగా క్యామ నవనీత (ఖిల్లా ఘణపురం) ఉపాధ్యక్షుడిగా: కొత్తకాపు వెంకటేశ్వర్ రెడ్డి (దొడగుంటపల్లి) డైరెక్టర్లుగా: దిండు రవీందర్ (వెల్టూర్), డి. బాలరాజు (జంగమయ్యపల్లి), ముప్పూరి రత్నయ్య (మణిగిల్ల), తలకొండపల్లి రఘునాథ్ (పెద్దమందడి), బయన్న రామచంద్రయ్య (మానాజీపేట), పాత్లావత్ భాష (దొంతికుంట తాండా), ఎస్. రవీందర్ రెడ్డి (సోలిపూర్), మర్యాద బాలకృష్ణ రెడ్డి (కంబాలపురం), బత్తుల దుర్గయ్య (సల్కేలాపురం), ఎం.డి. ఖాజా నైముద్దీన్ (ఘణపూర్), తూడి రవీంద్రనాథ్ రెడ్డి, తూము రామకృష్ణారెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. పాలకవర్గానికి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు పార్టీ శ్రేణులు రైతులు యువకులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!