ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపరెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే దిగువ నేలటూరు జగనన్న కాలనీలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నిర్మాణం:-

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే దిగువ నేలటూరు జగనన్న కాలనీలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నిర్మాణం:-

📰 Generate e-Paper Clip

సిపిఐ బ్రహ్మంగారిమఠం మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ డిమాండ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ బ్రహ్మంగారిమఠం మండలంలోని దిగువ నేలటూరు గ్రామ జగనన్న కాలనీలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ, వాటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం అత్యంత బాధాకరమని సిపిఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ తీవ్రంగా ఆక్షేపించారు. దిగువ నేలటూరు జగనన్న కాలనీలో ఇప్పటికే సుమారు 70 మంది పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. అదే ప్రాంతంలో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) కూడా ఏర్పాటు చేయబడింది. దీనివల్ల ఆ భూమి ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి అనే విషయం అధికారులకు తెలియదా అని అయన ప్రశ్నించారు. ప్రత్యేకించి దిగువ నేలటూరు ఎస్సీ కాలనీకి చెందిన పేద కుటుంబాలకు ప్రస్తుతం నివాసం ఉంటున్న స్థలం వర్షాకాలం వస్తే భూమిలోనుండి నీరు ఊట రూపంలో నిరంతరం పరుతూ ఉంటుంది. దీనివలన ప్రజలు అవస్థలు పడుతు వారి ఇళ్లు కూడా ప్రమాదాపూటంచుల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో భవిష్యత్తులో ఇళ్ల స్థలాలు కేటాయించాలంటే అందుబాటులో ఉన్న ప్రధాన ప్రభుత్వ భూమి ఇదొక్కటే. అలాంటి స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు కాకుండా ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు ప్రయత్నించడం సామాజిక న్యాయానికి, పేదల హక్కులకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజలు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం, నిర్మాణ పనులను నిలిపివేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖదే అయినప్పటికీ, అధికారులు తమ బాధ్యతలను విస్మరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అయన అన్నారు. ప్రభుత్వ భూమిపై ఏ నిర్మాణమైనా చేపట్టే ముందు సంబంధిత శాఖల అనుమతులు, భూ కేటాయింపు వివరాలు, ప్రజా అవసరాలపై ప్రభావం వంటి అంశాలను పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో పారదర్శకత పాటించకపోతే ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయని అన్నారు. పేదల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వ భూములను కాపాడాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలను కలుపుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని పెద్దుల్లపల్లి ప్రభాకర్ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!