ఢిల్లీలో హైకమాండ్ ముందే రేవంత్ రెడ్డిని తిట్టిన మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి
రేవంత్ మీద తిరగబడుతున్న సొంత పార్టీ నాయకులు
వరుసగా అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్
“ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం” అంటూ ఉత్తమ్
రేవంత్ రెడ్డి తీరుతో అసంతృప్తిగా ఉన్న సీతక్క
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 11 2026: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 20 సీట్లు కూడా రావని నిర్ధారణకు కాంగ్రెస్ హైకమాండ్ తన మంత్రిత్వ శాఖలోనే కాకుండా ఇతరుల శాఖల్లో కూడా జోక్యం చేసుకుని అడ్డగోలుగా పెత్తనం చేస్తున్నాడని ఫిర్యాదు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి యాదాద్రి దేవాలయ ట్రస్టు బోర్డు పదవుల నియామకాల్లో ఎవరికీ సమాచారం లేకుండా, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను పక్కనపెట్టి ఇతరులకు పదవులు కట్టబెట్టారని, దీంతో ఎన్నో ఏళ్లుగా కష్టపడిన కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారని ఫిర్యాదు చేసిన మహేష్ కుమార్ గౌడ్ పదవుల అంశంలో కార్యకర్తలు, నాయకులు అసంతృప్తిగా ఉన్నట్టు తన దృష్టికి కూడా వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు వత్తాసు పలికిన మీనాక్షి నటరాజన్ సమన్వయ కమిటీ నుంచి తిరిగి వచ్చాక, హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జర్నలిస్టులతో చిట్‌చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి ఆ చిట్‌చాట్‌లో మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై తన అక్కసు వెళ్లగక్కిన రేవంత్ రెడ్డి అసలు నేను కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేకపోతే వాళ్లు ఎవరు? వాళ్ల స్థాయి ఏంటి? నా మీద చాడీలు చెప్పడం తప్ప వాళ్లకు ఏం చేతకాదు అంటూ రేవంత్ రెడ్డి దుర్భాషలాడి, వార్తను బయటకు పంపొద్దని జర్నలిస్టులకు చెప్పినట్టు సమాచారం అయితే నారద పాత్ర పోషించే కొందరు జర్నలిస్టులు ఈ వార్తను ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేరవేయడంతో, మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డిని వర్ణిస్తూ బూతులతో తిడుతూ, “అధికారం రేవంత్ రెడ్డి జాగీరనుకున్నాడా? ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అధికారం కాదు” అంటూ మండిపడ్డ ఉత్తమ్ అందరి శాఖల్లో జోక్యం చేసుకుని చిన్నాభిన్నం చేస్తున్నాడని ఉత్తమ్ ఆగ్రహం అయితే మహేష్ కుమార్ గౌడ్ కూడా బహిరంగంగా అందరి ముందే రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం ఇటీవల బోనాల పండుగ సందర్భంగా ఒకరి ఇంట్లో విందుకు వెళ్లినప్పుడు, “మీరు నా గురించి ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసు, మీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది” అని అందరి ముందూ వార్నింగ్ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్ అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సీతక్క సైతం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయడంలేదని, ఆమె కూడా రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు రేవంత్ రెడ్డి పని తీరుతో సంతృప్తి చెందిన మంత్రుల్లో మొదటి లిస్టులో భట్టి విక్రమార్క ఉండడం, రేవంత్ రెడ్డి ఏ పని చేసినా భట్టి విక్రమార్క వెనకేసుకురావడం చర్చనీయాంశం ఇటీవల భట్టి విక్రమార్కపై వచ్చిన అవినీతి ఆరోపణల వల్ల తన మంత్రి పదవి పోకుండా కాపాడినందుకే రేవంత్ రెడ్డిపై భట్టి విక్రమార్క ఎనలేని ఆప్యాయత కలబరుస్తున్నాడని సన్నిహితుల మధ్య గుసగుసలు మరోవైపు సీక్రెట్‌గా చేయించిన సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని తేలడంతో అయోమయంలో పడిన అధిష్ఠానం ముఖ్యమంత్రిని మార్చితే పార్టీపై వ్యతిరేక ప్రభావం పడుతుందనే ఆలోచనలో అధిష్ఠానం ఉందని సమాచారం దేశమంతా బీజేపీకి వ్యతిరేకంగా మారుతుంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పరిస్థితులు ఏర్పడడంతో సందిగ్ధంలో పడిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం అవ్వడానికి ప్రధాన కారణం మంత్రుల అవినీతితో పాటు హైడ్రా అరాచకాలు అని బలంగా అధిష్ఠానం నమ్ముతున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుల చర్చలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కౌరవుల గ్రూప్, పాండవుల గ్రూప్ అని ఏర్పడిన రెండు గ్రూపులు ఇప్పుడు హాట్ టాపిక్ రేవంత్ రెడ్డితో సహా టీడీపీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కౌరవులుగా, తమను తాము పాండవులుగా చెప్పుకుంటున్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు మొత్తానికి రేవంత్ రెడ్డి అసమర్థత, అవగాహనా రాహిత్యం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోర పరాజయం తప్పదని రాజకీయ విశ్లేషకుల విమర్శలు

