
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
పెద్దపల్లి పట్టణంలోని స్థానిక *రైజింగ్ సన్ పాఠశాలలో* ఈరోజు ఘనంగా నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సత్కరణ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్* హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ విశిష్ట సేవలందిస్తున్న *హిందీ అధ్యాపకురాలు శ్రీమతి లలిత, *ఆంగ్ల ఉపాధ్యాయురాలు శ్రీమతి హుమేరా**లను ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి మొమెంటో, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
అలాగే ప్రతి ఏడాది రైజింగ్ సన్ పాఠశాల నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దుతూ పాఠశాలకు విశేష కీర్తి తీసుకొస్తున్న *వ్యాయామ ఉపాధ్యాయులు తగురం తిరుపతి* గారిని కూడా ప్రత్యేకంగా సత్కరించారు.
అనంతరం రాష్ట్ర స్థాయి వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థులకు సీ.ఐ. ప్రవీణ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు (Certificates of Appreciation) ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సీ.ఐ. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ఓటీపీ మోసాలు, పోక్సో (POCSO) చట్టం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, అనుమానాస్పద సంఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సయీద్ అహ్మద్, ప్రధానోపాధ్యాయులు హకీమ్ ఖాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

