ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిరైతులు రసాయన ఎరువులు విపరీతంగా వేయడం ద్వారా భూమి సారాన్ని పూర్తిగా చంపుతున్నారు

రైతులు రసాయన ఎరువులు విపరీతంగా వేయడం ద్వారా భూమి సారాన్ని పూర్తిగా చంపుతున్నారు

📰 Generate e-Paper Clip


– రసాయన మందులు జల్లకుండా భూములను కాపాడుకుందాం. ఆరోగ్యాన్ని రక్షించుకుందాం,
భూ సారా పరీక్షలు లను ఉచితంగా ప్రభుత్వం చేయిస్తుంది,
– మన గ్రామాల్లో ఆర్గానిక్ ద్వారా పండించిన పంటలు,కూరగాయలు,పండ్లు తినేది, ప్రస్తుతం గ్రామాలు వదిలి, పట్టణాలకు పోవాలని అందరూ చూస్తున్నారు,
– గతంలో భూములు ఉన్న వారికి బంగారం ఉంటే ధనవంతులు అనేది, కానీ నేడు భూములు అమ్ముకొని పట్టణాలకు వలస వెళ్లడం ప్యాషన్ అయ్యింది,
– ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో రైతులు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది,
ఇతర దేశాలలో భూములు తీసుకొని మరి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు,
– మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే. అరుణ,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 20. 2026.
మన దేశంలో రైతులు రసాయన ఎరువులు విపరీతంగా వేయడం ద్వారా భూమి సారాన్ని పూర్తిగా చంపుతున్నారని, రసాయన మందులు జల్లకుండా భూములను కాపాడుకొని ఆరోగ్యాన్ని రక్షించుకుందాం,భూ సారా పరీక్షలు లను ఉచితంగా ప్రభుత్వం చేయిస్తుందని,నేను కూడా రైతు బిడ్డనే,నా చిన్నతనంలో పశుసంపద, ఎద్దులు ప్రతి ఇంట్లో ఉండేవని ,ఆవుల మందలు సాయంత్ర సమయంలో ఊర్లోకి వస్తుంటే చాలా సంబరంగా అనిపించేదని, మన గ్రామాల్లో ఆర్గానిక్ ద్వారా పండించిన పంటలు,కూరగాయలు,పండ్లు తినేది, ప్రస్తుతం గ్రామాలు వదిలి, పట్టణాలకు పోవాలని అందరూ చూస్తున్నారు, గతంలో భూములు ఉన్న వారికి బంగారం ఉంటే ధనవంతులు అనేది, కానీ నేడు భూములు అమ్ముకొని పట్టణాలకు వలస వెళ్లడం ప్యాషన్ అయ్యిందని, ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో రైతులు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని,ఇతర దేశాలలో భూములు తీసుకొని మరి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే. అరుణ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ వ్యవసాయ విధానంపై రైతుల అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే. అరుణ కు మదనాపూర్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వంగూరు రామకృష్ణారెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువా తో సన్మానించారు.ఈ సందర్భంగా రైతన్నల అవగాహన సదస్సులోపాల్గొని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే. అరుణ మాట్లాడుతూ రైతులు వ్యవసాయానికి వాడే రసాయన ఎరువులను తగ్గించి కేంద్ర ప్రభుత్వం చూపించిన విధంగా పంట భూములు సారవంతంగా ఉండేందుకు, సేంద్రీయ ఎరువులు వాడాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుటకు భాగస్వాములు కావాలని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు .వ్యవసాయం దండగ కాదు చిత్తశుద్ధి ఉంటే సేంద్రియ వ్యవసాయం పండగే నని,వ్యవసాయం అంటేనే భారతదేశం.అటువంటి వ్యవసాయ భూములు కాపాడుకోవాలని,పకృతి, సేంద్రీయ వ్యవసాయం విస్తరించాల్సిన అవసరం తప్పక ఉందన్నారు.రసాయన ఎరువులతో వ్యవసాయ చేయడంతో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని,భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే సేంద్రీయ వ్యవసాయం చేయాలని అన్నారు.
పకృతిసిద్ధంగాఎరువులుతయారుచేసుకోవచ్చుని, రైతులకు ఖర్చులు తగ్గుతాయని,ప్రతి ఇంటికి ఒక ఆవు తప్పని సరిగా పెంచాలని, పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని అన్నారు.మిల్లెట్ పంట, రైతులకు లాభసాటివ్యవసాయమని,సేంద్రీయ వ్యవసాయంఆరోగ్యాన్నిరక్షిస్తుందని,అవ్వలు,తాతలు ఇప్పటికి గట్టిగా బలంగా ఉన్నారు అంటే కారణం, ఎటువంటిరసాయనాలులేనివ్యవసాయంద్వారావచ్చినఆహారంతీసుకోవడమేననిఅన్నారు.రైతుల కోసం అనేక కార్యక్రమాలు ప్రధాని నరేంద్ర మోదీచేపడుతున్నారని,సేంద్రియ వ్యవసాయ రైతుల అనుభవం, భవిష్యత్ తరాలకు
నేర్పించాలని, రైతులు ఒక ఆర్గనైజేషన్ గా మారితే ఖర్చులు తగ్గుతాయని , ప్రభుత్వ సబ్సిడీలు ఎక్కువగాఅందుతాయి,మార్కెటింగ్ సులభతరం అవుతుందని, పెద్ద ఎత్తున రైతులు సేంద్రీయ వ్యవసాయం చేయాలని అన్నారు.దేశ వ్యాప్తంగా కేత్ బచావో అభియాన్ లో భాగంగా ప్రతి జిల్లాలో రైతు సమావేశాలు జరుగుతున్నాయని,సేంద్రీయ వ్యవసాయం పై రైతులందరికీ అవగాహన కల్పించే గొప్ప కార్యక్రమాలు కేంద్రం నిర్వహిస్తుందని,భూ సారం పెంచితే ప్రతి రైతులకు పంట దిగుబడి పెరుగుతుందని, ప్రతి గ్రామంలోరచ్చబండల వద్ద సేంద్రీయ వ్యవసాయం గురించి రైతులు చర్చ చేయాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ పార్లమెంటు బిజెపి కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి ,మహబూబ్నగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి , కె.వికే శాస్త్రవేత్తలు రాజేందర్ రెడ్డి బృందం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజా రెడ్డి , రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అనుజ్ఞ రెడ్డి, దాబా శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గం ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు భరత భూషణ్, కౌన్సిలర్ గాయత్రి సత్యం సాగర్, మాజీ కౌన్సిలర్లు నారాయణమ్మ, నవీన్ కుమార్ రెడ్డి, అడ్వకేట్ రాములు యాదవ్, జిల్లా సీనియర్ నాయకులుమాధవరెడ్డి,కొండ వెంకటేశ్వర శెట్టి, బాబు గౌడ్, దుప్పల్లి కృష్ణ, మండల నాయకులు శివ నాయుడు, భాస్కర్, బురాన్, కురుమన్న,వడ్డెరాజు,శ్రీను,నితిన్,బాలవర్ధన్,మహేష్,ఆనందు, నాగరాజు, ఆంజనేయులు, రాములు, భీమన్న, రతన్లాల్,ఆశన్న, మైబు, రాము, శివ,తదితరనాయకులతోపాటు రైతులు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!