ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeతెలంగాణరైతు గోస – బీజేపీ భరోసా బస్సు యాత్రలో రైతులకు అండగా నిలిచిన బీజేపీ నాయకులు

రైతు గోస – బీజేపీ భరోసా బస్సు యాత్రలో రైతులకు అండగా నిలిచిన బీజేపీ నాయకులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 06 2026: భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన “రైతు గోస – బీజేపీ భరోసా” బస్సు యాత్ర కార్యక్రమంలో రైతుల సమస్యలను బీజేపీ నాయకులు ప్రత్యక్షంగా పరిశీలించారు. గత నెల రోజులుగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. తమ కష్టార్జిత పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ధాన్యం పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ తెలంగాణ నాయకులకు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకట్రాం రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుజ్ఞా రెడ్డి, కిసాన్ మోర్చా బస్సు యాత్ర కాటారం మండల ఇంచార్జ్, పార్టీ కార్యకర్తలు, రైతులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ప్రతి మండలంలో ఎంత ధాన్యం పండుతుందో ప్రభుత్వ అధికారుల వద్ద పూర్తి లెక్కలు ఉన్నప్పటికీ, ముందస్తు ప్రణాళిక లోపం వల్ల కొనుగోళ్లు ఆలస్యమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతులు పండించిన ధాన్యం అకాల వర్షాలకు నష్టపోవాల్సి వచ్చిందని అన్నారు. అలాగే అనేక ప్రాంతాల్లో ధాన్యానికి అధిక తరుగు విధించడం, లారీల కొరత, మిల్లర్లు ధాన్యాన్ని అన్‌లోడ్ చేసుకోవడంలో నిర్లక్ష్యం చూపడం వంటి సమస్యల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎండకు ఎండి, వానకు తడుస్తూ సరైన సమయంలో భోజనం కూడా చేయలేక అనారోగ్యానికి గురవుతున్నారని, కొన్ని చోట్ల రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేశారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని బీజేపీ నాయకులు భరోసా కల్పించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!