ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపవిద్యార్థులు పాఠాలపై శ్రద్ధ పెట్టి చదవండి... క్రమశిక్షణ పట్టుదల విద్యార్థి అభివృద్ధికి ఎంతో అవసరం.

విద్యార్థులు పాఠాలపై శ్రద్ధ పెట్టి చదవండి… క్రమశిక్షణ పట్టుదల విద్యార్థి అభివృద్ధికి ఎంతో అవసరం.

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపట్రిక/పిఎన్9టీవీ తెలుగు న్యూస్ రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలం లో ఉన్న సెయింట్ ఆంటినీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణ కలిగి చదువుపై మక్కువ చూపించాలని పాఠశాల కరస్పాండెంట్ చిత్త రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పాఠశాలలో చేరిన నూతన విద్యార్థినీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువు పైన దృష్టి మరల్చి చక్కని ఆటపాటలతో ఇష్టంగా చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రతి ఒక్కరు సమైక్యత భావంతో కలసిమెలసి ఉండాలని తెలిపారు. కొత్త విద్యార్థుల కు పాఠశాల నియమ నిబంధనలు గురించి తెలియజేశారు. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!