పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి మంద లక్ష్మీనారాయణ/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిది జూన్ 27 2026: జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో. వివాహ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మనీషా మదన్‌లాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు మనీషా మదన్‌లాల్ కి ఘన స్వాగతం పలికారు. ప్రజలతో ఆప్యాయంగా మమేకమవుతూ, ప్రతి కుటుంబ సంతోషంలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం, సాంప్రదాయాల పరిరక్షణకు ఇలాంటి శుభకార్యాలు వేదికలుగా నిలుస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, మండల మరియు గ్రామ స్థాయి కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన ప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి ప్రజలకు మరింత చేరువ కావాలని నాయకులు పిలుపునిచ్చారు. వివాహ వేడుకల సందర్భంగా గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు మనీషా మదన్‌లాల్ నికలిసి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ ముందుండే నాయకురాలిగా బానోత్ మనీషా మదన్‌లాల్ గుర్తింపు పొందారని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
