స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు నేటి తరానికి ఆదర్శప్రాయం
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 17 2026:వీరనారి చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం ఆధ్వర్యంలో బ్రిటిష్ రెసిడెన్సి పై దాడి అనే అంశంపై శుక్రవారం దర్బార్ హాల్లో చరిత్రక సదస్సు ఘనంగా నిర్వహించారు. చరిత్ర సదస్సుకు విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ అధ్యక్షతన నిర్వహించారు. చరిత్ర సదస్సుకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మొదలుపెట్టారు. కార్యక్రమంలో భాగంగా చరిత్ర విభాగ విద్యార్థినులు ప్రదర్శించిన బ్రిటిష్ రెసిడెన్సి పై దాడి చారిత్రక నాటిక విశేషంగా ఆకట్టుకుంది. తుర్రె బాజ్ ఖాన్, మౌల్వి అల్లావుద్దీన్ నాయకత్వంలో జరిగిన విరోచిత పోరాటాన్నివిద్యార్థినులు హృద్యంగా ఆవిష్కరించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. మాజీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు టి వివేక్ మరియు డాక్టర్ పద్మ రచించిన “తెలంగాణ రాష్ట్ర ఉద్యమం- కల్లోల భరిత సంవత్సరాలు” గ్రంథాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… 1857 తొలి స్వాతంత్ర సంఘం గ్రామంలో హైదరాబాద్ లోని బ్రిటిష్ రెసిడెన్సి పై జరిగిన చారిత్రక దాడిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి నిర్వహించడం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. బ్రిటిష్ రెసిడెన్సిపై జరిగిన దాడి తెలంగాణ చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక ఘట్టమని పేర్కొన్నారు. చరిత్రను తెలుసుకోవడం అంటే మన మూలాలను తెలుసుకోవడమేనని అన్నారు. వీరుల పోరాటాల వల్లే మనకు స్వేచ్ఛా వాతావరణం లభించిందని, విద్యార్థులు చరిత్రను కేవలం పాఠ్యాంశంగా కాకుండా స్ఫూర్తిగా స్వీకరించాలని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలోమహిళల పాత్ర ఎంతో కీలకమైందని మహిళ స్వాతంత్ర సమరయోధుల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అమరవీరుల త్యాగాలు వచ్చే తరాలకు ఆదర్శంగా ఉండాలని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు అమరవీరుల పేర్లు పెడుతూ గౌరవిస్తున్నారని తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ పేరు మీద ఉన్న ఈ విశ్వవిద్యాలయం మహిళా సాధికారతకు ప్రతీక అని కొనియాడారు. చరిత్రలోని మహనీయుల జీవితాలు యువతకు మార్గదర్శకాలని ,విద్యతో పాటు విలువలు, దేశభక్తి కూడా విద్యార్థులకు అవసరమని తెలిపారు. స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ఎప్పటికీ మరువరాదని సూచించారు. దేశాభివృద్ధికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. చరిత్ర స్ఫూర్తితో సమాజాభివృద్ధి, దేశ ప్రగతి కోసం అందరం కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ఎల్ పాండురంగారెడ్డి, ప్రొఫెసర్ సత్యనారాయణ, సురేందర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.


