వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి, అక్టోబర్- 29:వెలుగుమట్ల కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు కాలనీలో చేపడుతున్న అన్ని మౌళిక వసతుల పనులను నవంబర్ నెలాఖరు లోగా యుద్దపతిపాదన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం వెలుగుమట్ల కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వెలుగుమట్ల కాలనీలో నిర్మాణాలు మౌళిక వసతులతో సహా పూర్తి కావాలన్నారు. ప్రతి ఇంటి నిర్మాణ స్థితిగతులు, ప్రస్తుతం జరుగుతున్న పనులు, పూర్తికావాల్సిన పనులు, పనుల పురోగతి వివరాలను అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
అధికారులు ప్రతి రోజూ పనులను, ఇళ్ల నిర్మాణాల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. నిర్మాణాల్లో ఎటువంటి సమస్య వచ్చిన అధికారులు సమన్వయంతో పరిష్కరించాలన్నారు.
ఇళ్ల నిర్మాణంతోపాటు బస్తీ దవాఖానా, పాఠశాలల నిర్మాణాలు, రహదారులు, డ్రైనేజీలు తదితర మౌళిక వసతుల పనులను పూర్తి చేయాలని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


