ePaper
Thursday, October 29, 2026
📄 ePaper

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

📰 Generate e-Paper Clip

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి

భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల మంజూరులో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి

భూగర్భ మురుగునీటి పారుదల పనులు ఫిబ్రవరి 2027 నాటికి వంద శాతం పూర్తి చేయాలి

యూఐడీఎఫ్ నిధులతో మంజూరైన ప్రారంభం కాని 30 పనులను వెంటనే ప్రారంభించాలి

ఆస్తి పన్ను వసూళ్లు వంద శాతం సాధించాలి

ప్రభుత్వ భూములను పరి రక్షించాలి.. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించాలి

ఖమ్మం ఖిల్లా రోప్‌వేకు మెరుగైన అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయాలి

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై అధికారులతో సమీక్షించిన మంత్రి


ఖమ్మం, అక్టోబర్ -29: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి, ఖమ్మం నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

నగరంలో పట్టణ ప్రణాళిక, భవన నిర్మాణ అనుమతులు, మౌళిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు, తదితర అంశాలపై గురువారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఖమ్మం నగర పరిధిలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) క్రింద వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించి డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

అర్హులైన వారికి లేఅవుట్ అనుమతులు సకాలంలో మంజూరు చేయాలని, అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి 15 రోజులకు ఒకసారి సంబంధిత శాఖల అధికారులతో లేఅవుట్ అనుమతులపై సమీక్ష సమావేశం నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశాల్లో నీటిపారుదల శాఖ అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని, చెరువులు, నీటి వనరుల పరిధిలోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఎలాంటి అనుమతులు మంజూరు కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

భవన నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ:

నగరంలో భవన నిర్మాణ అనుమతులను నిబంధనల ప్రకారం మాత్రమే మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. మంజూరైన అనుమతులకు అనుగుణంగానే నిర్మాణాలు జరిగేలా టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలకు నిబంధనల మేరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు వీలైనంత త్వరగా జారీ చేయాలని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించి, నగరంలో క్రమబద్ధమైన పట్టణ ప్రణాళిక అమలయ్యేలా చూడాలన్నారు.

యూఐడీఎఫ్ నిధులతో మంజూరైన పనుల్లో ఇప్పటివరకు ప్రారంభం కాని 30 పనులను వెంటనే ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.

నగరంలో కొనసాగుతున్న భూగర్భ మురుగునీటి పారుదల పనులను ఫిబ్రవరి 2027 నాటికి వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

నగరంలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని నగరంలోని రహదారుల మధ్య డివైడర్లలో ఉన్న మొక్కలకు నీరు అందించేందుకు వినియోగించాలని తెలిపారు. శుద్ధి చేసిన నీటిని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పన్నుల వసూళ్లలో వంద శాతం లక్ష్యం సాధించాలి:

నగరంలో ఆస్తిపన్నుతో పాటు నీటి సరఫరా, ఇతర మున్సిపల్ పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పన్నుల వసూళ్లలో వెనుక బడిన ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.

నగర పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన యంత్రాలు, పరికరాల సంఖ్యను పెంచాలని తెలిపారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించి, నగరంలోని అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రతను నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు:

ఖమ్మం నగర పరిధిలోని ప్రభుత్వ భూములను ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాలని మంత్రి సూచించారు. తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్‌తో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ భూములను గుర్తించి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆర్ అండ్ బీ అతిథి గృహం, బడ్జెట్ హోటల్, ఇంటిగ్రేటెడ్ డివిజన్ కార్యాలయ నిర్మాణాలకు అవసరమైన స్థలాలను సకాలంలో గుర్తించి అందుబాటులోకి తీసుకురావాలని తహసీల్దార్లకు సూచించారు. నగరంలో ఎక్కడా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు ఉండకూడదని, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టేకులపల్లి బ్రిడ్జి వద్ద ప్రజల భద్రతకు అవసరమైన రక్షణ ఏర్పాట్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఖిల్లా రోప్‌వేకు అప్రోచ్ రోడ్డు.. బీసీ హాస్టళ్ల పనులు పూర్తి చేయాలి:

ఖమ్మం ఖిల్లా రోప్‌వేకు చేరుకునేందుకు వీలుగా మెరుగైన అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

నగరంలో నిర్మాణంలో ఉన్న మూడు బీసీ హాస్టళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. నగర అభివృద్ధికి సంబంధించిన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్...

జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై మండల సిపిఐ సమితి ఆగ్రహం 

 జూలూరుపాడు అక్టోబర్ 29: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి:సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్

కొత్తగూడెం, అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

భద్రతా చర్యలు పాటించకుండా నివాస ప్రాంతంలో భారీ మొత్తంలో టపాసుల అక్రమ నిల్వ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,మేడిపల్లి పోలీస్...

ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, అక్టోబర్ 29: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు,...

Related Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి, అక్టోబర్- 29:వెలుగుమట్ల కాలనీలో నిర్మిస్తున్న...

జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై మండల సిపిఐ సమితి ఆగ్రహం 

 జూలూరుపాడు అక్టోబర్ 29: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై. సిపిఐ మండల సమితి...
error: Content is protected !!