ePaper
Thursday, October 29, 2026
📄 ePaper

భద్రతా చర్యలు పాటించకుండా నివాస ప్రాంతంలో భారీ మొత్తంలో టపాసుల అక్రమ నిల్వ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

📰 Generate e-Paper Clip

మేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో కాచవాని సింగారం, జయశంకర్ విగ్రహం సమీపంలోని నివాస ప్రాంతంలో ఎటువంటి భద్రతా చర్యలు పాటించకుండా భారీ మొత్తంలో టపాసులను నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది మరియు ఇద్దరు సాక్షులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వివిధ రకాల టపాసులను ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.సుమారు 100 కిలోల టపాసులను, మొత్తం 58 పెట్టెలు మరియు ఇతర ప్యాకెట్లలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి విచారించారు.ఏలగందుల స్వామి, తండ్రి వెంకటేష్, వయస్సు 31 సంవత్సరాలు, వృత్తి: బార్బర్, నివాసం: జయశంకర్ విగ్రహం సమీపంలో, కాచవాని సింగారం.జక్కుల శ్రీనివాస్ తండ్రి మల్లేష్, వయస్సు 36 సంవత్సరాలు, వృత్తి: డ్రైవర్, నివాసం: ఇంటి నం. C1/108, దేవేందర్ నగర్ కాలనీ, ఉప్పల్ వీరిద్దరూ తగిన భద్రతా చర్యలు తీసుకోకుండా టపాసులను నిల్వ ఉంచినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో పంచ సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించి, టపాసులను స్వాధీనం చేసుకున్నారు.

పై ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న టపాసులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సిఐ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ
టపాసులను నివాస ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిల్వ ఉంచడం, భద్రతా ప్రమాణాలు పాటించకుండా బాణసంచాను నిల్వ చేయడం ప్రమాదకరం. అగ్నిప్రమాదాలు మరియు ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు సంబంధిత నిబంధనలు, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. ఇలాంటి అక్రమ నిల్వలు లేదా ప్రమాదకర కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.

Latest Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ...

జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై మండల సిపిఐ సమితి ఆగ్రహం 

 జూలూరుపాడు అక్టోబర్ 29: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి:సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్

కొత్తగూడెం, అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, అక్టోబర్ 29: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు,...

Related Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి, అక్టోబర్- 29:వెలుగుమట్ల కాలనీలో నిర్మిస్తున్న...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల మంజూరులో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి భూగర్భ మురుగునీటి పారుదల పనులు ఫిబ్రవరి 2027 నాటికి వంద శాతం...
error: Content is protected !!