ePaper
Sunday, November 1, 2026
📄 ePaper

“శుభకార్యంలో ఆశీర్వాదం.. విషాదంలో పరామర్శ.. ప్రజలకు అందుబాటులో సోయం వీరభద్రం”

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, నవంబర్ 1:అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం నిర్వహించిన శుభకార్యాలు, పరామర్శ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పాల్గొన్నారు. తొలుత అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన ఇటుకల హరిబాబు, ప్రియాంక దంపతుల కుమార్తెలు హిమవర్షిణి, రితువర్షిణిల ఓణీల అలంకరణ వేడుక పెనుబల్లి మండలం తాళ్లపెంట గ్రామంలో నిర్వహించగా, ఈ కార్యక్రమానికి హాజరైన సోయం వీరభద్రం చిన్నారులను ఆశీర్వదించి వారి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.అనంతరం అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ వార్డు సభ్యుడు రాంబాబు కుటుంబానికి చెందిన ఆళ్ళ దుర్గయ్య దశదినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. దుర్గయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.అదేవిధంగా ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో కుంజా సంతోషమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాసాని నాగశేషపద్మ, చంద్ర మోహన్, అశ్వారావుపేట మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ డాక్టర్ భుక్య ఉదయజ్యోతి, ప్రసాద్, మోటూరి మోహన్, వేముల హరీష్, మాజీ ఎంపీటీసీ అయిలూరి కృష్ణారెడ్డి, సోని శివశంకర్, సోయం చిన్నారి, తాటి రమణ, సరిహద్దుల వెంకటేశ్వరరావు, బద్దె సత్యనారాయణ, జీవన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

రోడ్లపై క్షుద్ర పూజల కలకలం!

 రాజాపురం ఎస్సీ కాలనీలో భయాందోళనలు.. మూఢనమ్మకాలపై చర్యలేవీ? ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్న దుండగులను...

దమ్మపేటలో గంజాయి కలకలం.. ఎనిమిది మంది పట్టివేత!

ఆరుగురికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్.. డీ-అడిక్షన్ కేంద్రానికి తరలింపు మరో ఇద్దరి వద్ద...

మెగా బెల్టు గ్రేడింగ్ టెస్ట్ లో ప్రతిభ చూపిన కొత్తకోట విద్యార్థి విద్యార్థినులు

–  విద్యార్థులకు సర్టిఫికెట్ బెల్టు అందించిన మహబూబ్నగర్ మేయర్ మమత,పొలిటికల్ పవర్...

షార్ట్ సర్క్యూట్ తో తోక మాధవి ఇల్లు దగ్ధo

–  షార్ట్ సర్క్యూట్ బాధితులను పరామర్శించిన కొత్తకోట కాంగ్రెస్ పార్టీ నాయకులు,పొలిటికల్...

సీఈఐఆర్ పోర్టల్‌తో పోగొట్టుకున్న మొబైల్‌ రికవరీబాధితుడికి ఫోన్‌ తిరిగి అందజేసిన అశ్వారావుపేట...

వైభవంగా స్వర్ణరథోత్సవం

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 31 (పొలిటికల్ పవర్ న్యూస్ )ఆరుద్రా...

Related Articles

రోడ్లపై క్షుద్ర పూజల కలకలం!

 రాజాపురం ఎస్సీ కాలనీలో భయాందోళనలు.. మూఢనమ్మకాలపై చర్యలేవీ? ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్న దుండగులను గుర్తించాలని గ్రామస్తుల డిమాండ్ ‌ అశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ, మేడపురెడ్డి నాగార్జున, నవంబర్ 1:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం...

దమ్మపేటలో గంజాయి కలకలం.. ఎనిమిది మంది పట్టివేత!

ఆరుగురికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్.. డీ-అడిక్షన్ కేంద్రానికి తరలింపు మరో ఇద్దరి వద్ద పావు కిలో గంజాయి స్వాధీనం.. నిందితులకు రిమాండ్పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 1:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గంజాయి వినియోగం,...

వైభవంగా స్వర్ణరథోత్సవం

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 31 (పొలిటికల్ పవర్ న్యూస్ )ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించబడింది. కాగా ఆరుద్రోత్సవంలో భాగంగా ఈ రోజు వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం,...
error: Content is protected !!