– శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సునీల్ చేతుల మీద బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్ 04.2026.భీమా భవిష్యత్తుకు ఎంతో భరోసా అని శ్రీరామ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సునీల్ అన్నారు.వనపర్తిజిల్లాకొత్తకోటమండలంకానాయపల్లి గ్రామంలో రావుల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకోసం ఒక సాయంత్రం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతితులుగా డీయం సతీష్, వనపర్తి వనపర్తి జిల్లా బ్రాంచ్ మేనేజర్ రాకేష్, బ్రాంచ్ డి ఓ లు రాములు, వెంకటేష్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రారంభించి సుమారు 60 సంవత్సరాలు కావస్తుందని అన్నారు. ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరమని తెలిపారు. కానాయపల్లి గ్రాంలో సుమారు 150కిపైగాఇన్సూరెన్స్ హోల్డర్స్ ఉన్నారని తెలిపారు. రావుల గోపాల్ రెడ్డి కృషితోఅందరికిభీమాకట్టించెందుకుచర్యలుతీసుకున్నాడనిసంతోషంవ్యక్తంచేస్తూగోపాల్.రెడ్డినిఅభినందించారు. ఇదే గ్రామానికి చెందిన వడ్డే మనోజ్ ఇటీవల రోడ్ ప్రమాదంలో చనిపోవడం జరిగిందని ఆ కుటుంబానికి 13లక్షల 50వేల చెక్కును అందజేస్తు ప్రతి నెల 6 వేల చొప్పున 18సంవత్సరాలువస్తాయని చెప్పారు. ప్రతి రోజుకు ఎన్నో ఖర్చులు చేస్తుంటాం వాటిలో కొంత మొత్తాన్ని జమ చేసి ఇన్సూరెన్స్ కట్టుకుంటే అనుకోని ప్రమాదంజరిగితేఆకుటుంబానికి భరోసాఉంటుందనితెలిపారు.ప్రతిమనిషికిఇన్సూరెన్స్ సౌకర్యం అనేది చాలా అవసరమని తెలిపారు. ముందుగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సిబ్బందికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భర్త సాయిలు, బిసి సంఘం నాయకులు భీమన్న నాయుడు, గోకరయ్య, కుర్మయ్య, రమేష్ రెడ్డి, శేఖర్ గౌడ్, బాజ గిరన్న, విష్ణురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

