ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper

శ్రీశైలం దేవస్థానంలోనీ బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం

📰 Generate e-Paper Clip


నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 3 (పొలిటికల్ పవర్ న్యూస్ )
లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించనున్నది.
ప్రతీ మంగళవారం మరియు అమావాస్యరోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడుతున్నాయి.
బయలువీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట మకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రిందివైపున కుడివైపు దక్షుడు, ఎడమవైపు భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి.
ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్ర పాలకుడికి పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయం,బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం మరియు అమావాస్య రోజులలో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామిపూజతో సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.

Latest Articles

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థిక సాయం మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర రెడ్డి

పొలిటికల్ పవర్ నాంపల్లి మండలం:పేదలకు ఆర్థిక సాయం నాంపల్లి మండల మాజీ...

స్థానిక పోరుకు కర్నూలు సిద్ధం

కర్నూలు జిల్లా (పొలిటికల్ పవర్):అప్పయ్య. ఎమ్ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో స్థానిక...

చికిత్స పొందుతూ ఆర్టీసీ కండక్టర్ మృతి

  – గత నెల 26న ప్రయాణీకురాలితో ఘర్షణ – బస్సులో నుంచి ప్యాసింజర్...

ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం, ఐద్వా ఆధ్వర్యంలో వర్షంలోను ఆందోళన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రికమాలోత్ అజయ్ నాయక్...

వరద నీటిలో పేదల బతుకులు.. లచ్చాపురం ఎస్సీ కాలనీపై పాలకుల దృష్టి ఎప్పుడు?

పాలకులు మారుతున్నా.. పేదల బతుకులు మారవా? లచ్చాపురం ఎస్సీ కాలనీలో వరద నీటిలో...

Related Articles

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థిక సాయం మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర రెడ్డి

పొలిటికల్ పవర్ నాంపల్లి మండలం:పేదలకు ఆర్థిక సాయం నాంపల్లి మండల మాజీ జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి చిట్టంపహాడ్ గ్రామ నివాసి బల్సుల భాగ్యమ్మ ఆకస్మిక మరణ వార్త విని ఆయన ఆపద్బాంధవుడిలా...

మధిర పట్టణంలోని మదర్ తెరిసా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగుదని పత్రిక & ఎన్ వి ఆర్ టి వి తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎన్ శివకుమార్ మాటూరు పేట వాస్తవ్యులు కీర్తిశేషులు బుల్లెద్దు...

చికిత్స పొందుతూ ఆర్టీసీ కండక్టర్ మృతి

  – గత నెల 26న ప్రయాణీకురాలితో ఘర్షణ – బస్సులో నుంచి ప్యాసింజర్ త్రోయడంతో టైర్ల కింద పడ్డ ప్రవళిక బందు కు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ...
error: Content is protected !!