పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్.06.2026. కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి మధనాపురం పట్టణ వాస్తవ్యులు సంబు పల్లవి సంబు ప్రసాద్ గారి దంపతులు వారి కుమారులు సంబు భానుతేజ , సంబు హర్షిత్ 2,51,116.( రెండు లక్షల యాభై ఒక్కవేయ్యి నూట పదహారు రూపాయలు ) విరాళాన్ని ప్రకటించి అయ్యప్ప సేవాసమితి ప్రధాన గురుస్వామి శ్రీ గోపాలకృష్ణ గురుస్వామి కి చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవాసమితి అధ్యక్షులు ధూపం నాగరాజు , బలిజ లింగేశ్వర్ , సత్యం సాగర్ , లక్ష్మీనారాయణ యాదవ్ , భాను ప్రకాష్ రెడ్డి , ఆంజనేయులు ఆలయ కమిటీ తరపున వారి కుటుంభ సభ్యులను శాలువాతో సన్మానించి ధన్యవాదములు తెలిపారు.
శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి ₹ 2,51,116. విరాళం అందజేసిన సంబు ప్రసాద్
0
9
Previous article
Next article

