తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎలుసరి కృష్ణయ్య

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 06 2026: మహబూబ్‌నగర్: ఎరుకల జాతి సంక్షేమం, ఆత్మగౌరవం, అభ్యున్నతి, హక్కుల సాధన కోసం ఐక్యంగా కృషి చేయాలని తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం (TYSS) రాష్ట్ర అధ్యక్షుడు పొన్నకల్ ఎలుసరి కృష్ణయ్య పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళాభవన్ లో తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవాధ్యక్షులు మాన్‌పాడు బాలయ్య (రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్), రాష్ట్ర అధ్యక్షులు పొన్నకల్ ఎలుసరి కృష్ణయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర సంఘాల్లో పనిచేసిన పలువురు తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘంలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా చేరిన ఎలుసరి బాలరాజు, మంగరాయి వెంకటేష్, ఎలుసరి శ్రీనివాసులు, నల్గొండ శాంతయ్య, నాగసారుతు పవన్ కుమార్ తదితరులకు నాయకులు కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎలుసరి కృష్ణయ్య మాట్లాడుతూ… గత 25 సంవత్సరాలుగా నీతి, నిజాయితీతో ఎరుకల జాతి సంక్షేమం, ఆత్మగౌరవం, అభ్యున్నతి, హక్కుల కోసం తమ వంతు పోరాటం చేస్తున్నామని తెలిపారు. చదువుకున్న ఎరుకల విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముందుకు వచ్చి వెనుకబడిన ఎరుకల కుటుంబాల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. త్వరలో అన్ని మండలాల్లో పర్యటించి నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని, అనంతరం ప్రతి జిల్లాలో కొత్త కమిటీలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. సంఘం కార్యక్రమాల విస్తరణలో భాగంగా అడహాక్ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా మంగరాయి వెంకటేష్, ఉపాధ్యక్షులుగా ఎలుసరి బాలరాజు, నల్గొండ శాంతయ్య లను నియమించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలుసరి తిరుమలేశు, ఎలుసరి రామస్వామి, ముద్దని చెన్నయ్య, కుంభ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


