ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంసత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

📰 Generate e-Paper Clip

యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యం – ఎస్.కె. మీరా ఖాసీం

కోర్టు సిబ్బంది, న్యాయ శాఖ ఉద్యోగులతో యోగాసనాల ప్రదర్శన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 21 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్.కె. మీరా ఖాసీం సాహెబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.కె. మీరా ఖాసీం మాట్లాడుతూ… యోగా చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని, ప్రతిరోజూ ఆచరించడం ద్వారా మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ఉల్లాసంతో రోజువారీ పనులను నిర్వహించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ అడ్వకేట్ కొండపల్లి విజయకుమార్ పలు యోగాసనాలను కోర్టు సిబ్బందితో చేయించారు. యోగాసనాల ప్రాముఖ్యతను వివరించి, వాటిని క్రమం తప్పకుండా ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి.ఎస్.ఎన్. సుమబాల, సీనియర్ సివిల్ అడ్వకేట్ కొండపల్లి విజయకుమార్, పి. శాంతి, కోర్టు సిబ్బంది, న్యాయ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!