ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

సత్యనారాయణ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన కాకాని

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్  తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జిల్లా సెంట్రల్ జైల్లో అక్రమ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న DCCB మాజీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తో కలిసి పరామర్శించిన మాజీ మంత్రి మంత్రివర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా కాకాణి గోవర్ధన్ రెడ్డి

 

కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా, అరాచకంగా వ్యవహరిస్తోంది
DCCB మాజీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా
తన పొలంలో బాట వేసుకుంటుంటే అడ్డుపడి, దుర్భాషలాడి దాడికి దిగారు
గుండెపోటుతో వ్యక్తి చనిపోతే సత్యనారాయణ రెడ్డిపై హత్య కేసు చిత్రీకరించారు
ఇప్పటికే 97 రోజులు జైలులో ఉంచినా కక్ష తీరక మళ్లీ అరెస్ట్ చేశారు
సత్యనారాయణ రెడ్డితో పాటు మరో ఆరుగురు అమాయకులను అక్రమంగా జైలుపాలు చేశారు
కూటమి నాయకులు ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, అక్రమ కేసులు మోపి జైలుపాలు చేస్తున్నారు

మాజీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (DCCB) అధ్యక్షుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని కూటమి ప్రభుత్వం రెండోసారి అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి కాకాణి తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్బంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..రాజకీయ కక్ష సాధింపుతో కూటమి ప్రభుత్వం ఎంత విచ్చలవిడిగా, అరాచకంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి సత్యనారాయణ రెడ్డి అరెస్టు సంఘటనే పరాకాష్ట అని మండిపడ్డారు. సత్యనారాయణ రెడ్డి తన పొలంలో బాట వేసుకుంటుండగా, కొందరు అడ్డుపడి దుర్భాషలాడి దాడికి దిగారని తెలిపారు. అనంతరం అస్వస్థతకు గురైన ఒక వ్యక్తి (గుండెపోటుతో) మరణించాడని, దానికి సత్యనారాయణ రెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోయినా హత్య కేసుగా చిత్రీకరించారని ఆరోపించారు. సత్యనారాయణ రెడ్డిని ఇప్పటికే దాదాపు 97 రోజుల పాటు జైళ్లో ఉంచినా కక్ష తీరక, మళ్లీ హత్య కేసు పేరుతో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అన్యాయం..సత్యనారాయణ రెడ్డితో పాటు మరో ఆరుగురు అమాయకులను కూడా ఈ కేసులో ఇరికించి జైలుపాలు చేశారని విమర్శించారు.

వైయస్ఆర్ సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు..
రాష్ట్రంలో అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రశ్నించే వారిని అక్రమ కేసులతో జైలు పాలు చేస్తున్నారని కాకాణి ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు తమను ప్రశ్నించే వారిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ పరిణామాలపై ఇప్పటికే ఎంపీ గురుమూర్తి  సంజీవయ్య గారు తదితరులు విలేకరుల సమావేశంలో వాస్తవాలు వెల్లడించారని గుర్తుచేశారు.
సత్యనారాయణ రెడ్డి గుడ్ మార్నింగ్ పెల్లకూరు లాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు కక్షగట్టి గతంలో పోలీసులతో కేసులు పెట్టించి కోర్టు ఎదుట హాజరుపరిచారని అయితే కోర్టు పోలీసులను మందలించి ఆయనను విడుదల చేసినట్లు తెలిపారు, కోర్టు అక్షింతలు వేసినప్పటికీ పోలీసుల తీరు మారలేదని, కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పారన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా మర్డర్ కేసు నమోదు చేసి సత్యనారాయణ రెడ్డిని జైలుకు పంపడం దారుణమన్నారు.

న్యాయస్థానాలపై నమ్మకం..జైలులో ఉన్న సత్యనారాయణ రెడ్డిని కలిసి ధైర్యం చెప్పామని, ఆయన మనోధైర్యంతో ఉన్నారని కాకాణి తెలిపారు. తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నామని, సత్యనారాయణ రెడ్డితో పాటు అక్రమ కేసుల్లో ఇరుక్కున్న మరో ఆరుగురు వైయస్ఆర్ సీపీ కార్యకర్తలకు కోర్టు ద్వారా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు.

Latest Articles

దళితుల అంటే దాడి చేసే వాళ్ళు కాదు

పొలిటికల్ పవర్ ప్రతినిధి  తెలంగాణవాళ్లు కాంగ్రెస్ పార్టీ తొత్తులు, కట్టు బానిసలు...

 ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో కిలో బియ్యం...

పోక్సో కేసులో 20 సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష

⚖️ పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపొలిటికల్...

స్థానిక పోరుకు సిద్ధం కావాలి ధర్మాన కృష్ణదాస్

పొలిటికల్ పవర్ ప్రతి నిధి  శ్రీకాకుళం జిల్లాస్థానిక పోరుకు సిద్ధం కావాలి:...

Related Articles

 ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో కిలో బియ్యం రూ.2కే అందించిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. పేదరికం కారణంగా ఏ కుటుంబమూ ఆకలితో అలమటించకూడదని...

పోక్సో కేసులో 20 సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష

⚖️ పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి💰 రూ.15...

స్థానిక పోరుకు సిద్ధం కావాలి ధర్మాన కృష్ణదాస్

పొలిటికల్ పవర్ ప్రతి నిధి  శ్రీకాకుళం జిల్లాస్థానిక పోరుకు సిద్ధం కావాలి: ధర్మాన కృష్ణదాస్స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
error: Content is protected !!