ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

కలసపాడులో కూటమి ప్రభంజనం – బద్వేలు గడ్డపై టీడీపీ జెండా.

📰 Generate e-Paper Clip

 

కలసపాడు నవంబర్ 7 పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. వైయస్సార్ కడప జిల్లా.

బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలంలో కూటమి సత్తా చాటింది.

మొత్తం 9 MPTC స్థానాలకు గాను కూటమి 6 స్థానాలను కైవసం చేసుకుంది

టీడీపీకి 4, జనసేనకు 2 (ఒకటి ఏకగ్రీవం), వైసీపీకి కేవలం 3 స్థానాలు మాత్రమే దక్కాయి.కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించిన 2 స్థానాల్లో (1 ZPTC + 1 MPTC) 100% విజయం. ZPTC గా _భవనాసి విద్యావతి, 1567 ఓట్ల మెజారిటీతో_, MPTC కర్నాటి, నాగరత్నమ్మ 551 ఓట్ల మెజారిటీతోఘన విజయం సాధించారు.

బద్వేలు టీడీపీ ఇంచార్జ్ శ్రీ మంచూరి సూర్యనారాయణ రెడ్డి బద్వేల్ లోని తన స్వగృహమునందు స్వగృహంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఇంచార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 6 నెలలుగా నేను చేసిన సేవకు ప్రతిఫలంగా ఈ గెలుపును ప్రజలు నాకు ఇచ్చారు. వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ గెలుపు ప్రతి కార్యకర్తకు అంకితం.

నేను బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రతి మండలంలోని ప్రతి గ్రామం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. అసలైన అభివృద్ధి అంటే ఏమిటో ఇప్పటి నుండి చేసి చూపిస్తాను.బద్వేలు ఇంచార్జ్ గా ప్రతి కార్యకర్తను కాపాడుకోవడం నా బాధ్యత, అహర్నిశలు కష్టపడతాను. ప్రతి కార్యకర్తను 2029 సమరానికి యుద్ధ సైనికుడిలా తయారు చేస్తాను

.నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. పార్టీ నిర్ణయం మేరకే ఇంచార్జ్ గా ఉన్నాను. ఏ క్షణమైనా పార్టీ మరొకరికి అవకాశం ఇస్తే హృదయపూర్వకంగా ఆహ్వానించి ఒక సాధారణ సైనికుడిలా పార్టీ కోసం కృషి చేస్తాను. నేను వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటాను.జిల్లా పరిషత్ లో బద్వేలు గళం బలంగా వినిపించి బద్వేలును అభివృద్ధి పథంలో నడిపిస్తాము. బద్వేలు MLA అభ్యర్థిని గెలిపించి _నారా లోకేష్ కు కానుకగా_ ఇస్తాము. వైసీపీ గత దౌర్జన్యాల వల్లే ప్రజలు మాకు పట్టం కట్టారు. కూటమి గెలుపును ఎవరూ ఆపలేరు” అని ధీమా వ్యక్తం చేశారు.

Latest Articles

సాంస్కృతిక కార్యక్రమాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 7 ( పొలిటికల్ పవర్ న్యూస్...

జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర ఆకస్మిక తనిఖీ…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

Related Articles

సాంస్కృతిక కార్యక్రమాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 7 ( పొలిటికల్ పవర్ న్యూస్ )దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధనలో) శృతిలయ కూచిపూడి నృత్యాలయం, విజయవాడ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు...

దీపావళి శుభాకాంక్షలు * జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి..

. కలసపాడు నవంబర్ 7 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక కలసపాడు రిపోర్టర్వైఎస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అందిస్తూ...

రాజకీయ సంచలనం: జైలు గోడలు తెంచిన ‘ప్రజాభిమానం’.. పెళ్లకూరు జడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ సత్యనారాయణ రెడ్డి విక్టరీ! కార్యకర్తల ధీమా – ప్రజల తీర్పు: కక్షసాధింపు రాజకీయాలకు ఓటుతోనే తిరుగులేని జవాబు!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*పెళ్లకూరు: రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు తాత్కాలికమే తప్ప......
error: Content is protected !!