ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

దీపావళి శుభాకాంక్షలు * జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి..

📰 Generate e-Paper Clip

. కలసపాడు నవంబర్ 7 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక కలసపాడు రిపోర్టర్

వైఎస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అందిస్తూ జిల్లా కలెక్టర్. శ్రీధర్ చెరుకూరి…

చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులు సంప్రదాయబద్ధంగా దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇంటింటా వెలిగించే దీపాలు, దీపాల కాంతులు శుభానికి, ఆశకు ప్రతీకలని పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు, సవాళ్లు ఎదురైనా నిరాశ చెందకుండా ధైర్యంగా ఎదుర్కొని, పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధించాలనే గొప్ప సందేశాన్ని దీపావళి పండుగ అందిస్తుందని తెలిపారు.

జిల్లా ప్రజలందరూ తమ స్థోమతకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. అయితే దీపావళి వేడుకల్లో నూనె దీపాలు, టపాసులు, నిప్పు వంటి వాటితో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని, యువత అత్యుత్సాహానికి పోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.పండుగ ఆనందం ప్రమాదాల కారణంగా విషాదంగా మారకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యానికి తావివ్వకుండా సురక్షితంగా దీపావళి వేడుకలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Latest Articles

సాంస్కృతిక కార్యక్రమాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 7 ( పొలిటికల్ పవర్ న్యూస్...

జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర ఆకస్మిక తనిఖీ…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

Related Articles

సాంస్కృతిక కార్యక్రమాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 7 ( పొలిటికల్ పవర్ న్యూస్ )దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధనలో) శృతిలయ కూచిపూడి నృత్యాలయం, విజయవాడ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు...

కలసపాడులో కూటమి ప్రభంజనం – బద్వేలు గడ్డపై టీడీపీ జెండా.

 కలసపాడు నవంబర్ 7 పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. వైయస్సార్ కడప జిల్లా.బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలంలో కూటమి సత్తా చాటింది.మొత్తం 9 MPTC స్థానాలకు గాను...

రాజకీయ సంచలనం: జైలు గోడలు తెంచిన ‘ప్రజాభిమానం’.. పెళ్లకూరు జడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ సత్యనారాయణ రెడ్డి విక్టరీ! కార్యకర్తల ధీమా – ప్రజల తీర్పు: కక్షసాధింపు రాజకీయాలకు ఓటుతోనే తిరుగులేని జవాబు!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*పెళ్లకూరు: రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు తాత్కాలికమే తప్ప......
error: Content is protected !!