ePaper
Thursday, November 12, 2026
📄 ePaper

శ్రీశైల క్షేత్రంలో ఉచిత బస్సు సదుపాయం: ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు

📰 Generate e-Paper Clip

శ్రీశైలం (పొలిటికల్ పవర్ – పిఎన్9 టీవీ):

కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి వచ్చే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం దేవస్థానం తరఫున ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీ యం. శ్రీనివాసరావు తెలిపారు. నవంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు ఈ ఉచిత బస్సు సేవలు అందుబాటులో ఉంటాయని వారు వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాతాళగంగ మెట్లమార్గం నుంచి ప్రారంభమై నందిసర్కిల్, గంగాధర మండపం, ఉచిత క్యూలైన్ మీదుగా లడ్డూ విక్రయ కౌంటర్ల వరకు ఈ బస్సులు నిరంతరం నడుస్తాయని స్పష్టం చేశారు.

ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు భక్తులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పుణ్యక్షేత్రానికి తరలివచ్చే శివస్వాములు, పవిత్ర కార్తీక స్నానాలు ఆచరించే భక్తులు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు.

 

Latest Articles

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మద్దిగట్ల–మోజర్ల విద్యార్థిని శ్రీవల్లి

విద్యార్థినిని అభినందించిన ఉపాధ్యాయ బృందం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

ఆపదలో అభయహస్తం.. మేఘన్న ద్వారా బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవంటీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి నవంబర్ 12 పొలిటికల్...

మోజర్ల గ్రామంలో ఘనంగా గ్రామసభ నిర్వహణ.. 

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు జాగ్రత్తలకు సూచనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి...

మనిగిల్ల గ్రామ అభివృద్ధికి సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం

చెరువు కట్టలు, స్మశాన వాటికలో కంపచెట్ల తొలగింపు.. పశువుల దాహార్తి తీర్చేందుకు...

Related Articles

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు రోడ్డు ప్రమాదం.. స్వల్ప గాయాలతో సురక్షితం!

హైదరాబాద్ / పొలిటికల్ పవర్ న్యూస్: నాగరాజు రెడ్డిటాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం...

error: Content is protected !!