– ఛత్రపతి షాహూజీ మహారాజ్ జయంతి సందర్భంగా బిసి సంగం ఆధ్వర్యంలో
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 27.2026.
సామాజిక న్యాయం సమానత్వం విద్యా విప్లవానికి మార్గదర్శకులు ఛత్రపతి షాహూజీ మహారాజ్ అని బిసి సంగం కొత్తకోట అధ్యక్షులు రాములు యాదవ్ అన్నారు. శుక్రవారంకొత్తకోటమున్సిపాలిటీకేంద్రంలోని పట్టణ చౌరస్తాలో బీసీ సంఘం ఆధ్వర్యంలో చత్రపతి ఛత్రపతి షాహూజీ మహారాజ్ చిత్రపటానికి
పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిసి సంగం కొత్తకోట అధ్యక్షులు రాములు యాదవ్ మాట్లాడుతూ ఛత్రపతి షాహూజీ మహారాజ్ వంటి మహానుభావుడినిమాత్రంఎన్నటికీమర్చిపోవద్దని,ఆయన సామాజిక న్యాయం,సమానత్వం,విద్యావిప్లవా నికిమార్గదర్శకులు అని అన్నారు.ఛత్రపతి షాహూజీ మహారాజ్ కేవలం ఒక రాజు మాత్రమే కాదని, సమాజ పరివర్తనకు బాటలు వేసిన మహోన్నత సంస్కర్త, విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని, అణగారిన ప్రజలకు గౌరవప్రదమైన జీవితందక్కాలని జీవితాంతం కృషి చేశారని అన్నారు.అస్పృశ్యులు, వెనుకబడిన వర్గాలు, శోషితుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం భారత సామాజిక విప్లవ చరిత్రలో చిరస్మరణీయ అధ్యాయం. ఆయన జయంతి కేవలం స్మరణ దినం కాదని, సామాజిక మార్పుకు సంకల్ప దినమని అన్నారు. షాహూజీ మహారాజ్ ఆశయాలను ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి చేర్చడం,సామాజికన్యాయం,సమానత్వం,మానవత్వం అనే విలువలను ఆచరణలో పెట్టడం నేటి తరం బాధ్యతని,రాజర్షి షాహూ మహారాజ్ జయంతిని ఒక సామాజిక ఉత్సవంగా జరుపుకుందాం మని, ఆయన కలలుగన్న సమాన సమాజ నిర్మాణం కోసం గ్రామస్థాయి నుంచి ఫలితాలిచ్చే కార్యాచరణకు మనమందరం సంకల్పిద్దాంమని ఆయనఅన్నారు.ఈ కార్యక్రమంలో కొమ్ము భరత్ భూషణ్, హనుమంతు యాదవ్, వెంకటన్న గౌడ్, గంగాధర్, అభిమన్యుడు, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

