పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై 05 2026: లలిత కళా సమాఖ్య మరియు మొగిలి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో సామాజిక సేవ, విద్యాభివృద్ధి మరియు ప్రభుత్వ సేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, బాలుర హాస్టల్–బి, ఖమ్మం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్–I) కోటపాటి రుక్మారావుకు ప్రతిష్ఠాత్మకమైన “స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం–2026” ను ఘనంగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో కోటపాటి రుక్మారావు అందిస్తున్న సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.
అవార్డు స్వీకరించిన అనంతరం కోటపాటి రుక్మారావు మాట్లాడుతూ… ఈ గౌరవం తనకు లభించిన గొప్ప గుర్తింపని, అదే సమయంలో సమాజం పట్ల మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. ఈ పురస్కారానికి తనను ఎంపిక చేసిన లలిత కళా సమాఖ్య మరియు మొగిలి ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధి మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత నిబద్ధతతో సేవలందిస్తానని పేర్కొన్నారు. అనంతరం అవార్డు వచ్చిన సందర్భంగా హాస్టల్ విద్యార్థులు ఘనంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజికవేత్తలు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు.
సామాజిక సేవ, విద్యాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలకు కోటపాటి రుక్మారావుకు “స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం–2026”
RELATED ARTICLES
