బ్రహ్మంగారిమఠం పొలిటికల్ పవర్9 టీవీతెలుగుఏం, వెంకటేశ్వర్లు,కడప (జిల్లా) :- బ్రహ్మంగారి మఠం మండల జడ్పిటిసి స్థానానికి సిపిఐ(యం)
అభ్యర్థిగా పోటీ చేస్తున్న గండి సునీల్ కుమార్ నేడు కొత్తూరు, పాతూరు, కక్కయ్య నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి సిపిఎం పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని మండలాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని నిరంతరం అందుబాటులో ఉండే నాయకుని ఎన్నుకోవాలని
సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి వేయించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో సిపిఎం మండల నాయకులు సానా గోవింద స్వామి రవణమ్మ,అజయ్ రాహుల్,విజయ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

