మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
కీసర సర్కిల్ : జవహర్ నగర్ : ఉన్నత విద్యకు దూరమైన వారికి దూరవిద్య ద్వారా సువర్ణావకాశం. స్థానిక CRPF గ్రూప్ సెంటర్, జవహర్‌నగర్లోని మెన్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో DIG డా. బి. వీర్రాజు మాట్లాడుతూ, విద్యకు దూరమైన వారికి ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) స్టడీ సెంటర్ – LSC No. 238ను CRPF క్యాంపస్‌లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివి మధ్యలో విద్యను కొనసాగించలేకపోయిన వారు, అలాగే గ్రామీణ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ స్టడీ సెంటర్ ద్వారా B.A., B.Com. మరియు B.Sc. తదితర డిగ్రీ కోర్సులను అభ్యసించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
BRAOU తరగతులు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాల్లో నిర్వహించబడతాయని DIG డా. వీర్రాజు తెలిపారు. యూనివర్సిటీ ద్వారా BRAOU TV, T-SAT ఛానల్ మరియు దూరదర్శన్ వంటి మాధ్యమాల ద్వారా కూడా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఉద్యోగులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు మరియు ఇతర కారణాల వల్ల రెగ్యులర్ కళాశాలకు వెళ్లలేని అభ్యర్థులు తమకు అనుకూలమైన విధానంలో ఉన్నత విద్యను కొనసాగించవచ్చని తెలిపారు. CRPFలో విధులు నిర్వహిస్తూ అంగవైకల్యానికి గురైన జవాన్లకు కూడా యూనివర్సిటీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి ఫీజులో రాయితీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు DIG డా. వీర్రాజు తెలిపారు. విద్య ద్వారా వారి భవిష్యత్తును మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ అవకాశం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. GC, CRPF జవహర్‌నగర్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DIG డా. వీర్రాజు విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ విద్యా అర్హతలను పెంపొందించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కో-ఆర్డినేటర్ మరియు CRPF పబ్లిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీ కనపర్తి హరి శంకర్ పాల్గొన్నారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 09-09-2026. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అవసరమైన ధ్రువపత్రాలు. – 10వ తరగతి / SSC సర్టిఫికెట్. – ఇంటర్మీడియట్ / 12వ తరగతి / డిప్లొమా సర్టిఫికెట్. – ఆధార్ కార్డు. సంప్రదించవలసిన వివరాలు స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్: శ్రీ K. హరి శంకర్. 📞 9959034477,. క్లర్క్: శ్రీమతి కళ్యాణి రెడ్డి 📞 7981837962,. 📱 9441474923 (WhatsApp మాత్రమే). స్టడీ సెంటర్: BRAOU LSC No. 238,. FWC, GC, CRPF, జవహర్‌నగర్. ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
