ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeతెలంగాణసీసీ రోడ్డు అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

సీసీ రోడ్డు అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే మాణిక్ రావు, గ్రామ సర్పంచ్ మచ్చేందర్..

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ జూన్ 19 2026: జహీరాబాద్: మండల పరిధిలోని హోతి బి గ్రామంలో గ్రామ సర్పంచ్ మచ్చేందర్ ఇరవై లక్షల గ్రామ పంచాయితీ నిధులతో ఎన్ఆర్ఈజీఎస్ మొత్తం ఇరవై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు మరియు అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించి, అదేవిధంగా గ్రామస్తులకు మొక్కలను పంపిణి చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామంలోని వార్డులో అంతర్గత మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నామని తెలిపారు.వర్షాకాలంలో ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నిధుల కొరత లేకుండా నియోజకవర్గం గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ నెంబర్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!