ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన  డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 24 2026: వనపర్తి పట్టణ కేంద్రంలో జిల్లెల తిరుపతి రెడ్డి ఇంటి పైన టాటా కంపెనీ 5 కెడబ్ల్యూ 1పిహెచ్ తో భారత్ సోలార్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ వాళ్లు ఏర్పాటుచేసిన సోలార్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… ఈ రోజు సోలార్ ప్లాంట్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది అని భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే సోలార్ శక్తి వినియోగం చాలా అవసరం అని అన్నారు. సూర్యకాంతి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కాలుష్యం తగ్గుతుంది మరియు పర్యావరణ పరిరక్షణలో సోలార్ ఎనర్జీ కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు. సోలార్ విద్యుత్ వల్ల రైతులు, చిన్న వ్యాపారులు విద్యుత్ ఖర్చును తగ్గించుకోగలరు అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు సోలార్ ప్లాంట్లు ఎంతో ఉపయోగపడతాయి అని అన్నారు. ప్రభుత్వం కూడా పునరుత్పాదక శక్తి వనరుల అభివృద్ధికి ప్రత్యేక సబ్సిడీ లను ఇచ్చి ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు.ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే విద్యుత్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి కాబట్టి యువత కూడా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను అని తెలిపారు. అభివృద్ధి, ఆదా, పర్యావరణ రక్షణ — ఈ మూడు లక్ష్యాలను సోలార్ శక్తి సాధిస్తుంది కాబట్టి సోలార్ ప్లాంట్లను వినియోగించుకోవాలి అని అన్నారు. కార్యక్రమంలో భారత్ సోలార్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఎండి రాజు యాదవ్, సోలార్ టెక్నీషియన్స్ శీను, రూమిబాయ్, నాగరాజు, కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్ ఈశ్వర్, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

Related Articles

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర...

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు  సమాన ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి

–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్. 19. 2026.విద్యార్థులు...

ప్రత్యేక అవసరాల పిల్లలకు సమగ్ర విద్య..

రైతులకు మెరుగైన మార్కెట్‌ సేవలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: పెబ్బేరులో నూతన భవిత...
error: Content is protected !!