ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

స్నేహం కోసం! మరణించిన స్నేహితుని కుమార్తె వివాహానికి బాసట 

📰 Generate e-Paper Clip

రూ.5.60 లక్షల వితరణ అందజేసిన తోటి స్నేహితులు 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో రావూరి నాగేశ్వరరావు నాయుడు చేయి చేయికలిపి స్నేహబంధం చాటిన వేళ స్వార్థం, సంకుచితత్వం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఆ స్నేహితులు స్నేహ బంధాన్ని చాటుకున్నారు.భౌతికంగా ఈ లోకంలో లేని తన స్నేహితుని కుమార్తె వివాహానికి బాసటగా నిలిచారు. పన్నెండేళ్ళ కిందట కిందట మరణించిన తన స్నేహితుడు మెచ్చేలా మిత్ర ధర్మాన్ని ఈ లోకానికి చాటి చెప్పారు. “స్నేహమంటే ఇదేరా” అంటూ చేయి చేయి కలిపి చనిపోయిన స్నేహితుని కుటుంబ వివాహంలో వాళ్ళంతా పెళ్లి పెద్దలయ్యారు. ఖమ్మం నగరానికి చెందిన ఎండి మహబూబ్ అలీ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్యోగిగా పని చేసేవాడు. 2013లో ఆయన అకస్మాత్తుగా గుండె పోటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఆ సమయంలో పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబం ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంది. ఇప్పుడు మహబూబ్ అలీ కుమార్తెకు పెళ్లి నిశ్చయమైంది. ఇదే సమయంలో ఖమ్మం జమ్మిబండ ప్రాంతంలోని జ్యోతి బా లమందిర్ 1986-87తెలుగు మీడియం బ్యాచ్ అతని పదవ తరగతి మిత్రులు తమ స్నేహ బంధాన్ని చాటుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. వివిధ రంగాల్లో ఉన్నతంగా స్థిరపడిన ఆ స్నేహితులు చేయి చేయి కలిపి అనూహ్యంగా లక్షల సొత్తును సేకరించారు. పదో తరగతిలో కలిసి చదువుకున్న తన స్నేహితుని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తలా కొంత సాయంగా వేసుకొని రూ.5.60 లక్షల మొత్తాన్ని కూడబెట్టారు. మంగళవారం ఖమ్మం లొ జరిగిన తమ స్నేహితుడి కుమార్తె వివాహంలో రూ.5.60 లక్షల మొత్తాన్ని అందజేసి వారంతా మిత్ర ధర్మాన్ని చాటి చెప్పారు. మహబూబ్ అలీ స్నేహితులైన ఎన్ ఆర్ ఐ లు డాక్టర్ సుధాకర్, నాగుబండి ముత్యాలరావు, చింతలపూడి శ్రీకాంత్, ఎం మాధవి, శివాజి, స్థానికంగా ఉంటున్న డాక్టర్ రామరాజు, ఆర్ సత్యనారాయణ, పవన్ తదితరులు ఈ వితరణ సేకరణను ముందుండి నడిపించడం హర్షణీయం. నిజంగా ఇదే కదా స్నేహం అంటే.! స్నేహానికి అర్ధం మారుతున్న ఈ కాలంలో ఎప్పుడో చనిపోయిన పదో తరగతి స్నేహితుడిని గుర్తు పెట్టుకుని ఆయన కుమార్తె పెళ్లికి తోటి స్నేహితులంతా సహకరించడం అద్భుతమే. పెళ్లి కూతురు అన్న అమన్ అలీ తొ మహమూద్ స్నేహితులు పెళ్లి కూతురు అన్న అమన్ అలీ తొ మహమూద్ స్నేహితులు

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు...

కళాకారులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం రవీంద్రభారతిలో నిరసన

పొలిటికల్ పవర్ ప్రతినిధి హైదరాబాద్* సమస్య: గత మూడేళ్లుగా వివిధ...

సమగ్ర నివేదికతో మండల సర్వసభ్య సమావేశం కి హాజరవ్వాలి ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకటనారాయణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఉపాధి అవకాశాలను పెంచడంలో వేదురు సాగు కీలకపాత్ర పోషిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు

పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి:ఎల్ల స్వామి జయశంకర్ భూపాల్ పల్లివెదురును ‘పచ్చని బంగారం’గా అభివర్ణిస్తూ, దాని సాగు, వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రపంచ...

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరం

పొలిటికల్ పవర్ ప్రతినిధి: సత్తుపల్లి*సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, ప్రేరణాత్మక శిక్షణ అందించిన ఇన్స్పైర్ అండ్ ఇగ్నిట్ ఫౌండేషన్ బృందానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ...

యూపీఐ లావాదేవీల పై పన్ను ఎత్తివేయాలని మాస్ లైన్ ఆందోళన

*యూపీఐ పన్ను ప్రజలపై కొత్త బాదుడే సిపిఐఎంల్ మాస్ లైన్*జూలూరుపాడు సెప్టెంబర్ 18: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిన్ 9 తెలుగు న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
error: Content is protected !!