— పెద్దమందడిలో బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిరంతరం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. పథకాలను కొనసాగించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు.ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, హామీల అమలులో నిర్లక్ష్యం చేస్తే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని నాయకులు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోరాటం కొనసాగిస్తామని, హామీలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


