పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా బ్యూరో పి ఎల్ మూర్తి హుకుంపేట మండల కేంద్రంలో ప్రతి శనివారం జరిగే వారపు సంతలో ఆడ్డాకుల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాల క్రితం కావడి ఆడ్డాకులు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు విక్రయించగా, ప్రస్తుతం అదే కావడికి కేవలం రూ.1,400 నుంచి రూ.1,600 మాత్రమే లభిస్తోంది. జీసీసీ కొనుగోళ్లు లేకపోవడంతో దళారులే ధరలను నిర్ణయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో జీసీసీ కొనుగోళ్లతో మంచి ధర లభించేదని, వెంటనే అధికారులు స్పందించి వారపు సంతలో ఆడ్డాకులు, కొండచీపుర్లు కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
హుకుంపేట వారపు సంతలో ఆడ్డాకుల ధర పతనం.. రైతుల ఆందోళన
0
11
Previous article
Next article
RELATED ARTICLES


