పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 13 2026: స్నేహితుల అనుబంధానికి గుర్తుగా పెద్దమందడి గ్రామనికి చెందిన 2009 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు మిత్రుడి పెళ్లికి ప్రత్యేకమైన బహుమతిని అందించి అందరి దృష్టిని ఆకర్షించారు.వరుడితో ఎన్నో సంవత్సరాలుగా చదువుకొని స్నేహం కొనసాగిస్తున్న మిత్రబృందం,అతనికి గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా ఎంపిక చేసిన హెల్మెట్ గిఫ్ట్‌ను అందజేసి ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనకోసం మన కుటుంబం కోసం బాధ్యతతో అందరు ధరించాలని ఈ మధ్యకాలంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అలా జరగకుండా మనం ధరించి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలవాలని కోరారు. గిఫ్ట్ ఇస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి వేడుకలో ఈ బహుమతిని అందుకున్న వరుడు ఆనందం వ్యక్తం చేయగా,అక్కడికి వచ్చిన బంధువులు,అతిథులు కూడా స్నేహితుల ఆప్యాయతను అభినందించారు.స్నేహానికి గుర్తుగా ఇచ్చిన ఈ గిఫ్ట్, వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చిందని పలువురు పేర్కొన్నారు.స్నేహితులు అందించిన ఈ బహుమతి తమ మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని,జీవితాంతం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని వరుడు తెలిపాడు పెళ్లి వేడుకలో ఈ సంఘటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్నేహితుడి పెళ్లికి ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు
0
19

